YS Jagan: ప్రచార కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాన్వాయ్ కింద కుక్కపడడంతో సీఎం వైఎస్ జగన్ చలించిపోయారు. ప్రత్యేక వైద్యం అందించాలని తన అధికారులను ఆదేశించారు. ఈ ఘటనతో ముఖ్యమంత్రి అధికారులు ఆగమేఘాల మీద స్పందించి వెంటనే ఆస్పత్రికి తరలించి ప్రత్యేక వైద్య సదుపాయం కల్పించారు.
Also Read: YSRCP Manifesto: వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో కీలక హామీలు ఇవే.. వీటితో జగన్‌కు మరోసారి సీఎం అవుతారా?
ఎన్నికల ప్రచారంలో విస్తృత పర్యటన చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. తాడేపల్లి నుంచి సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి వెళ్తున్నారు. ఈ సమయంలో కేసరపల్లి వద్ద సీఎం కాన్వాయ్‌కు కుక్క అడ్డం పడింది. ఈ ఘటనలో కుక్కకు గాయాలవడంతో ముఖ్యమంత్రి వ్యక్తిగత భద్రతా సిబ్బంది కుక్కని ఆస్పత్రికి తీసుకెళ్లమని గన్నవరం పోలీసులను ఆదేశించారు.
Also Read: Pithapuram: పవన్ కల్యాణ్‌కు భారీ షాక్.. పిఠాపురంలో గెలుపు కష్టమా? చెప్పులు కుట్టే వ్యక్తి కూడా
సీఎం జగన్ ఆదేశాలతో వెంటనే భద్రతా సిబ్బంది ప్రభుత్వ వైద్యశాలలో గాయపడిన కుక్కకు వైద్యం చేయించారు. అనంతరం గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద కుక్కను భద్రంగా ఉంచారు. పూర్తిగా కోలుకునే వరకు జాగ్రత్తగా చూసుకోవాలని ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది పోలీసులకు ఆదేశించింది. గన్నవరం నుంచి నెల్లూరు జిల్లా కందుకూరులో సీఎం జగన్ పర్యటించారు. ఈ పర్యటనలో ప్రతిపక్ష కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కానీ హామీలతో ముందుకొస్తున్నాడని విమర్శించారు.
పొత్తుతో వస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నారా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఎన్నికల కోసం ఏపీకి వచ్చారని.. ఓడిన వెంటనే తెలంగాణకు వెళ్లిపోతారని తెలిపారు. సంక్షేమ ప్రభుత్వం మళ్లీ ఐదేళ్లు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి అని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మీ బిడ్డకు తోడుగా ఉండాలని కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter