YS Vivekananda Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తనకు ప్రాణ భయం ఉందని అంటున్నాడు. సీబీఐకి ఇచ్చిన రెండో వాంగ్మూలం తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పాడు. తనకు భద్రత కావాలనిపిస్తోందని పేర్కొన్నాడు. ఈ మేరకు కడప ఎస్పీ, సీబీఐ అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పాడు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరినట్లు తెలిపాడు.
అప్రూవర్‌గా మారిన తర్వాత తనకు ఎవరెవరి నుంచో ఫోన్ కాల్స్ వస్తున్నాయని దస్తగిరి వాపోయాడు. డబ్బుల కోసం తాను అప్రూవర్‌గా మారినట్లు జరుగుతున్న ప్రచారాన్ని దస్తగిరి ఖండించాడు. తన భార్య, బిడ్డలు అనాథలు కావొద్దనే సీబీఐ ముందు నిజాలు వెల్లడించినట్లు చెప్పాడు. అంతే తప్ప, తనపై ఎవరి ప్రలోభాలు లేవని స్పష్టం చేశాడు.
దస్తగిరి అప్రూవర్‌గా మారాక సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించి బయటకొచ్చిన వివరాలు సంచలనం రేపుతున్నాయి. అప్రూవర్‌గా మారిన తర్వాత తనను భరత్ యాదవ్, నిందితుడు దేవిరెడ్డి తరుపు న్యాయవాది ఓబుల్ రెడ్డి కలిసినట్లు దస్తగిరి తన వాంగ్మూలంలో వెల్లడించాడు. తనకు భూమి, డబ్బు ఇస్తామని ప్రలోభ పెట్టినట్లు తెలిపాడు. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం వివరాలు చెప్పాలని తనపై ఒత్తిడి చేశారని.. ఇకపై ఎలాంటి వివరాలు చెప్పొద్దని తనపై ఒత్తిడి తెచ్చారని చెప్పాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తనకు ప్రాణ భయం ఉందని... భద్రత కావాలని దస్తగిరి జిల్లా ఎస్పీని కోరాడు.
మరోవైపు, వివేకా కేసు పులివెందుల కోర్టు నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయింది. ఇకనుంచి కడప జిల్లా కోర్టులోనే కేసు విచారణ జరగనుంది. ఇక ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారుల్లో ఒకరైన రామ్‌సింగ్‌పై కడప పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. విచారణ పేరుతో రామ్ సింగ్ తనను వేధిస్తున్నట్లు ఉదయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకు ఫిర్యాదు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
Also Read: నెరవేరిన సుక్కూ కల.. మెగాస్టార్‌ను డైరెక్ట్ చేయనున్న లెక్కల మాష్టారు.. ట్విస్ట్ ఏంటంటే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook