టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెదేపాలో చేరారు. ఆమె చేరడంతో ఇప్పటివరకు 22 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు వైసీపీ నుండి తెదేపాలో చేరారు. మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా వైసీపి నుండి జంప్ కావొచ్చని సమాచారం.

Last Updated : Nov 27, 2017, 04:31 PM IST
    • వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెదేపాలో చేరిక
    • వైసీపీ పార్టీలో నా ఆత్మాభిమానం దెబ్బతింది
    • చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పనులు చూసే టీడీపీలో చేరిక
టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

వైఎస్సాఆర్ సీపీ పార్టీకి మరో వికెట్ పడింది. ఆ పార్టీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెదేపాలో చేరారు. సోమవారం తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతో పాటు స్థానిక సర్పంచులు, వైసీపీ నాయకులు తెదేపాలో చేరారు. చంద్రబాబు నాయుడు వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. కాగా ఇప్పటివరకు 22 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు వైసీపీ నుండి తెదేపాలో చేరారు. మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా వైసీపి నుండి జంప్ కావొచ్చని సమాచారం.

ఇదిలా ఉండగా తాను పార్టీ ఎందుకు మారానో గిడ్డి ఈశ్వరి చెప్పుకొచ్చారు. తన ప్రాంతంలో వైసీపీ పార్టీ బలోపేతానికి, గిరిజనుల సంక్షేమానికి కృషి చేశానని.. కానీ నా శ్రమను జగన్ గుర్తించలేదని.. వైసీపీలో నా ఆత్మాభిమానం దెబ్బతిందని.. అందుకే పార్టీ మారానని చెప్పారు.  పాడేరు ప్రాంత అభివృద్ధి, గిరిజనుల సంక్షేమం బాగుపడేందుకే ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి పనులు చూసి నేను తెదేపాలో చేరుతున్నట్లు చెప్పారు.

కాగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పాడేరు ఇకెట్ గిడ్డి ఈశ్వరికే ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. గిడ్డి ఈశ్వరిని వచ్చే ఎన్నికల్లో పక్కన    కంబా రవిబాబు కి టికెట్ ఇవ్వాలని వైఎస్సాఆర్ సీపీ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయ్ సాయి రెడ్డి కొందరి వద్ద చెప్పడట. గిడ్డి ఈశ్వరితో మాట్లాడిన ఫోన్ సంభాషణలను కొందరు వ్యక్తులు రికార్డు చేసి వేరొకరికి పంపడం.. చివరకు ఆ రికార్డులు గిడ్డి ఈశ్వరికి చేరడంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురై వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

>

Trending News