Luxurious Trains: ఈ రైళ్లలో ప్రయాణిస్తే ఆ లగ్జరీనే వేరు.. మీరెప్పుడైనా ట్రై చేశారా ?

5 Most Luxurious Trains in India : ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని రైళ్లలో ప్రయాణం ఆహ్లాదాన్ని మాత్రమే కాదు.. ఆహా మళ్లీ ఎప్పుడెప్పుడు ఈ రైలు ఎక్కుదామా అని అనిపించేలా చేస్తుంది. ఆ రైళ్ల సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం రండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2023, 10:00 PM IST
Luxurious Trains: ఈ రైళ్లలో ప్రయాణిస్తే ఆ లగ్జరీనే వేరు.. మీరెప్పుడైనా ట్రై చేశారా ?

5 Most Luxurious Trains in India: రైలు ప్రయాణం అంటేనే ఆ మజానే వేరు. అయితే ఆ రైలు ఎంత సౌకర్యవంతంగా ఉంటే ప్రయాణం అంత ఎక్కువ ఆహ్లదకరంగా ఉంటుంది. అలాంటి హాయినిచ్చే జర్నీలో ఎంతసేపు ప్రయాణించినా అలసట రాదు సరికదా.. గమ్యం చేరగానే అప్పుడే ప్రయాణం అయిపోయిందా అనిపిస్తుంది. ఒకవేళ ఆ రైలులో పరిశుభ్రత లేకపోయినా.. రైలు బోగీలు న్యూలుక్ లేకపోయినా... ఆ ప్రయాణం నరకం అవుతుంది. ఎప్పుడెప్పుడు మన జర్నీ ముగుస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూడాల్సి వస్తుంది.

ఇదిలావుంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని రైళ్లలో ప్రయాణం ఆహ్లాదాన్ని మాత్రమే కాదు.. ఆహా మళ్లీ ఎప్పుడెప్పుడు ఈ రైలు ఎక్కుదామా అని అనిపించేలా చేస్తుంది. ఆ రైళ్ల సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం రండి.

1) డెక్కన్ ఒడిస్సి : 
రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ ముందుకు సాగిపోయే ఈ డెక్కన్ ఒడిస్సి రైలులో ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తుంది. మహారాష్ట్రలో టూరిజంను ప్రమోట్ చేసే లక్ష్యంతో 2005 లో ఈ రైలును ప్రారంభించారు. మహారాష్ట్రలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇండియన్ రైల్వేస్‌తో కలిసి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కృషిలో భాగంగానే ఈ రైలుని ప్రారంభించారు.  

రాయల్ స్టైల్లో లివింగ్ రూమ్‌ని తలపించే వెల్‌ఫర్నిష్డ్ క్యాబిన్స్, ఎటాచ్‌డ్ బాత్రూమ్స్ ఉన్న సూట్ క్యాబిన్స్, సకల సౌకర్యాలు ఈ రైలు సొంతం. సముద్రంలో ప్రయాణించే భారీ నౌకలో ఉండే సౌకర్యాల తరహాలో డైనింగ్ కార్, హెయిర్ కట్, స్పా సేవల కోసం సెలూన్, మందు బాబులకు మద్యం మిస్ కాకుండా బార్, ఫిట్నెస్ ఫ్రీక్స్ కోసం మిని జిమ్, కాన్ఫరెన్స్ హాల్స్, ఆయుర్వేదిక్ స్పా వంటి సౌకర్యాలు ఈ రైలుకు ఉన్న అదనపు హంగులు.  

ఇండియన్ ఒడిస్సి, ఇండియన్ సోజోర్న్, మహారాష్ట్ర స్ల్పెండర్, హిడెన్ ట్రెజర్స్ ఆఫ్ గుజరాత్, జెవెల్ ఆఫ్ ది డెక్కన్, మహారాష్ట్ర వైల్డ్ ట్రయల్.. ఇలా వివిధ మార్గాల్లో వివిధ పేర్లతో డెక్కన్ ఒడిస్సి సేవలు అందుబాటులో ఉన్నాయి.  

2) మహారాజ ఎక్స్‌ప్రెస్ :
ఐఆర్‌సిటిసి రన్ చేస్తోన్న రైలు సేవల్లో మహారాజ ఎక్స్‌ప్రెస్ ఒక లగ్జరీ ట్రెయిన్ సర్వీస్. డిలక్స్ క్యాబిన్స్, జూనియర్ సూట్ క్యాబిన్స్, సూట్స్, ప్రెసిడెన్షియల్ సూట్స్ వంటి సౌకర్యాలతో 23 క్యారేజుల పొడవుండే ట్రెయిన్ హౌజెస్ ఈ రైలు సొంతం.

ఈ రైలులో రంగ్ మహల్, మయూర్ మహల్ పేర్లతో రెండు అద్భుతమైన లగ్జరీ రెస్టారెంట్స్ ఉంటాయి. రంగ్ మహల్ అనేది రెడ్ ఫోర్ట్‌లోని రంగ్ మహల్‌ని పోలి ఉండగా.. మయూర్ మహల్ అనే రెస్టారెంట్ మయూరం థీమ్‌లో ఉంటుంది. ఈ రైలులో ప్రయాణం రాయల్ ఫ్యామిలీలో సెలబ్రేషన్ లా ఉంటుంది.

3) రాయల్ రాజస్థాన్ :
ఇండియన్ రైల్వేస్ సహకారంతో రాజస్థాన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్లాన్ చేసిన ఈ రైలు పేరు రాయల్ రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక క్షేత్రాలతో పాటు ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రా, వారణాసి, మధ్యప్రదేశ్‌లోని ఖజురహో వంటి పర్యాటక క్షేత్రాలను కవర్ చేస్తుంది. 
 
4) ప్యాలెస్ ఆఫ్ వీల్స్ :
వరల్డ్ క్లాస్ హాస్పిటాలిటీ అందించే మొట్టమొదటి లగ్జరీ రైలుగా రాయల్ రాజస్థాన్ ట్రెయిన్‌కి పేరుంది. అత్యాధునిక హంగులన్నీ ఈ రైలులో కనిపిస్తాయి. 

5) రాయల్ ఓరియంట్ :
గుజరాత్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్, ఇండియన్ రైల్వేస్ సంయుక్తంగా కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ఈ రాయల్ ఓరియంట్ ట్రెయిన్. 1994-95 లో ఈ రైలుని ప్రారంభించారు. రాజస్థాన్, గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలను అనుసంధానం చేస్తూ ఈ రైలు సేవలు అందిస్తోంది. 7 నైట్స్, 8 డే టైమింగ్స్ పాటు జరిగే ఈ రైలు ప్రయాణం అదరహో అనిపిస్తుంది.

ఇది కూడా చదవండి : Samsung Galaxy S23 Ultra: ఈ 200MP కెమెరా సూపర్ స్మార్ట్ ఫోన్‌పై రూ. 8వేల డిస్కౌంట్

ఇది కూడా చదవండి : Okaya Faast F3 EV Scooter: మార్కెట్లోకి మరో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆకట్టుకుంటున్న ఫీచర్స్

ఇది కూడా చదవండి : Renault Kwid Prices: మరింత తక్కువ ధరలో రెనో క్విడ్ RXE వేరియంట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News