Adani Group Stocks: అదానీ గ్రూప్‌కు మరో బిగ్‌ షాక్‌...ఆ 7 కంపెనీలు ఏం చేశాయో తెలుసుకుంటే మైండ్ బ్లాక్!

Adani Group Stocks:గౌతమ్ అదానీకి మరో బిగ్ షాక్ తగిలింది. బ్లూబెర్గ్ వార్తల ప్రకారం..మూడీస్ అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీతో సహా అదానీ గ్రూప్‌లోని 7 కంపెనీల రేటింగ్‌ను దారుణంగా తగ్గించింది.

Written by - Bhoomi | Last Updated : Nov 26, 2024, 05:34 PM IST
Adani Group Stocks: అదానీ గ్రూప్‌కు మరో బిగ్‌ షాక్‌...ఆ 7 కంపెనీలు ఏం చేశాయో తెలుసుకుంటే మైండ్ బ్లాక్!

Adani Group Stocks: గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ స్వతంత్ర భారత్ లో అత్యంత వేగంగా ఎదిగిన వ్యాపార సామ్రాజ్యం. విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నిర్వహణ, వంట నూనెలు, సిమెంట్ విద్యుత్తు ఎన్నో రంగాల్లో అదానీ కంపెనీలు విస్తరించి ఉన్నాయి. అయితే ఆ గ్రూప్ సంస్థల అధినేత, దిగ్గజ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ ఎంత వేగంగా ఎదిగారో అంతే వేగంగా ఆయన వ్యాపారాలపై ఆరోపణలు వచ్చాయి.  

గౌతమ్ అదానీ సహా ఏడుగురు వ్యక్తులు లంచం ఇచ్చినట్లు గత వారం అమెరికా ఫెడరల్ కోర్టు ఆరోపణలు చేసింది. ఆ తర్వాత రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అదానీ గ్రూప్‌కు చెందిన 7 కంపెనీల రేటింగ్‌ను తగ్గించింది. బ్లూమ్‌బెర్గ్ వార్తల ప్రకారం, మూడీస్ అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ సహా అదానీ గ్రూప్‌కు చెందిన 7 కంపెనీల రేటింగ్‌లను ప్రతికూల స్థాయికి తగ్గించింది. 

దీని కంటే ముందు  S&P గ్లోబల్ రేటింగ్స్ కూడా అదానీ గ్రూప్ కంపెనీల రేటింగ్‌ను ప్రతికూల స్థాయికి తగ్గించింది. అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ సహా మూడు అదానీ గ్రూప్ కంపెనీలకు రేటింగ్ ఏజెన్సీ ఔట్‌లుక్ ప్రతికూలంగా చేసింది. ఈ గ్రూప్ మనీ ట్రాన్సాక్షన్స్, అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి సమస్యలు ఉన్నట్లు పేర్కొంది. అయినప్పటికీ, రేటింగ్ ఏజెన్సీ "BBB-" వద్ద రేటింగ్‌ను కొనసాగించింది.

Read more: Tirumala: తిరుమలలో షాకింగ్ ఘటన.. శ్రీవారికే శఠగోపం పెట్టిన కేటుగాడు.. ఏంచేశాడో తెలుసా..?

అదానీ గ్రూప్‌కు సంబంధించి హిండెన్‌బర్గ్ నివేదిక కేసుకు సంబంధించి పిటిషనర్ విశాల్ తివారీ సుప్రీంకోర్టులో కొత్త దరఖాస్తును దాఖలు చేశారు. పిటిషన్‌లో, పిటిషనర్ భారత ఏజెన్సీని కూడా దర్యాప్తు చేయాలని కోరారు. గౌతమ్‌ అదానీపై అమెరికా న్యాయ శాఖ చేపట్టిన కోర్టు చర్య విషయంలో భారత దర్యాప్తు సంస్థలు కూడా తమ స్థాయిలోనే దర్యాప్తు చేయాలని సూచించింది. అదానీ గ్రూప్,  దాని సహచరులపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని కూడా పిటిషన్‌లో పేర్కొంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ ఆరోపణలపై విచారణ అవసరమని పేర్కొన్నారు.

ఆరోపణల మధ్య అదానీ గ్రూప్ కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ విషయం అదానీ గ్రీన్ కాంట్రాక్ట్‌కు సంబంధించినది మాత్రమే అని ఈ క్లారిఫికేషన్‌లో చెప్పింది. ఈ ఒప్పందం అదానీ గ్రీన్  మొత్తం వ్యాపారంలో 10శాతం మాత్రమే. గ్రూప్‌లోని 11 కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో నమోదయ్యాయి. ఈ విషయానికి గ్రూప్‌లోని మరే ఇతర కంపెనీతో సంబంధం లేదు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News