Samsung Galaxy S20 FE 5G Smartphones buy only Rs 39990 in Amazon: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం 'శాంసంగ్' తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల మరో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఈ 5జీను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను ముందుగా దక్షిణ కొరియాలో విడుదల చేయగా. ఆపై ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ ధర రూ. 74,999 లుగా ఉండడంతో కొందరు కొనుగోలుదారులు వెనకడుగువేశారు. అలాంటి వారికి ఓ శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'అమెజాన్'లో ప్రస్తుతం గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఈపై బంపర్ ఆఫర్ ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ అసలు ధర భారత్‌లో రూ. 74,999 లుగా ఉంది. అయితే అమెజాన్ 'డీల్ ఆఫ్ ది డే'లో భాగంగా ఈరోజు ఏకంగా 47 శాతం ఆఫర్ ప్రకటించింది. దాంతో రూ. 35,009 తగ్గింపుతో రూ. 39,990 లకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే ఉంది. మరో కొన్ని గంటల్లో ముగియనుంది. ఒకవేళ అమెజాన్ 'డీల్ ఆఫ్ ది డే'ను పొడిగిస్తే మరో రోజు కూడా ఈ ఆఫర్ కొనసాగనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఇస్తే.. రూ.12,750 వస్తుంది. మీ ఫోన్ కండిషన్ బాగుంటేనే గరిష్టంగా రూ.12,750లు ఎక్స్ఛేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. అప్పుడు గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఈ 5జీ మొబైల్ దాదాపుగా రూ. 27,000లకి సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ స్మార్ట్‌ఫోన్‌పై నో ఈఎంఐ కాస్ట్ కూడా ఉంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై కూడా రూ. 750 ఆఫర్ ఉంది.
స్పెసిఫికేషన్లు:
# 5G స్మార్ట్‌ఫోన్
# 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్ ఫినిటీ-ఓ డిస్ ప్లే
# క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్
# 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
# డ్యూయల్ ట్రిపుల్ కెమెరా (12MP, 8MP, 12MP)
# 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
# 4500 ఎంఏహెచ్ బ్యాటరీ
Also Read: WTC 2023 Final: లార్డ్స్‌లోనే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023, 2015 ఫైనల్స్!
Also Read: CM Kcr: హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో మణిహారం..పోలీస్ టవర్స్ ప్రారంభించనున్న సీఎం..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook