LPG Gas Cylinder Price: ఎల్పీజీ గ్యాస్ సిలెండర్‌పై భారీ తగ్గింపు, ఆ రాష్ట్రాల్లో సగం ధరకే గ్యాస్ సిలెండర్, ఎలాగంటే

LPG Gas Cylinder Price: ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరలు ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగిపోయాయి. ఇప్పుడు దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలున్న నేపధ్యంలో సిలెండర్ ధరలు తగ్గనున్నాయి. వివిధ రాష్ట్రాల్లో సిలెండర్లను తక్కువ ధరకే అందించనున్నట్టు ప్రకటనలు వెలువడుతున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 15, 2023, 02:20 PM IST
LPG Gas Cylinder Price: ఎల్పీజీ గ్యాస్ సిలెండర్‌పై భారీ తగ్గింపు, ఆ రాష్ట్రాల్లో సగం ధరకే గ్యాస్ సిలెండర్, ఎలాగంటే

LPG Gas Cylinder Price: ఎన్నికల వేళ ప్రజలకు తాయిలాలు అందుతున్నాయి. సగటున ప్రతి ఒక్కరూ ఇప్పుడు భారంగా భావిస్తున్నది గ్యాస్ సిలెండర్ ధరే. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధర గణనీయంగా పెరిగిపోయింది. ఎన్నికలు పురస్కరించుకుని కొన్ని రాష్ట్రాల్లో ఆ ధరలు సగానికి సగం తగ్గే పరిస్థితి కన్పిస్తోంది. అదెలాగో చూద్దాం.

దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఈ నెలలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గ్యాస్ సిలెండర్‌ను 400 రూపాయలకే అందించనున్నట్టు ప్రకటించింది. మీరు కూడా ఈ రాష్ట్రాలకు చెందిన గ్యాస్ వినియోగదారుడైతే ఆ ప్రయోజనం మీక్కూడా కలగనుంది. గ్యాస్ సిలెండర్ సగానికి సగం ధరకే పొందే అవకాశం కలగనుంది. ఇప్పటికే అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలెండర్ ధరను 200 రూపాయలు తగ్గించింది. 

ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు అర్హులైన లబ్దిదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలెండర్‌ను కేవలం 450 రూపాయలకే ఇవ్వనున్నట్టు ప్రకటించాయి. తెలంగాణ ప్రభుత్వమైతే 400 రూపాయలకే ఇస్తానంటోంది. తెలంగాణ, మద్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఈ నెలలోనే ఎన్నికలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మహిళలు, రైతులు, రైతు కూలీలు, వృద్ధులు ఇతరులకు ఇప్పటికే చాలా హామీలిచ్చింది. మహిళలకు 5 వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఇతరులకు 3 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించనుంది. అదే సమయంలో ఎల్పీజీ గ్యాస్ సిలెండర్‌ను 400 రూపాయలకే అందిస్తానని హామీ ఇచ్చింది. అదే సమయంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా ఎల్పీజీ గ్యాస్ సిలెండర్‌ను 450 రూపాయలకే ఇవ్వనున్నట్టు తెలిపాయి. 

ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధర వాస్తవానికి 1100 దాటేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 200 రూపాయలు తగ్గించడంతో ఇప్పుడు 900 రూపాయలు లభిస్తోంది. దేశంలో 33 కోట్ల గ్యాస్ యూనిట్లు ఉన్నాయి. 

Also read: SBI Superhit Scheme: సీనియర్ సిటిజన్లకు శుభవార్త, 10 లక్షల డిపాజిట్, పదేళ్లలో 21 లక్షలు ఎలాగంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News