BMW X5 Facelift: బీఎండబ్ల్యూ ఎక్స్ 5 లగ్జరీ విభాగంలో మోస్ట్ పాపులర్ కారుగా చెప్పవచ్చు. ఇప్పటికే గ్లోబలా్ మార్కెట్‌లో బీఎండబ్ల్యూ ఎక్స్ 5 ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లాంచ్ కాగా ఇప్పుడు ఇండియాలో కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఈ కారు ధర వింటే నోరెళ్లబెట్టాల్సిందే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
లగ్జరీ కార్లలో బీఎండబ్ల్యూ కారుకు ఉన్న ప్రత్యేకతే వేరు. లగ్జరీ విభాగంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కారు ఇది. బీఎండబ్ల్యూ ఎక్స్ 5 ఫేస్‌లిఫ్ట్ ఇప్పటికే ప్రపంచ మార్కెట్‌లో లాంచ్ కాగా ఇండియాలో ఇప్పుడు లాంచ్ అయింది. పెట్రోల్, డీజిల్, రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కారు ధరే నోరెళ్లబెట్టేలా చేస్తోంది. బీఎండబ్ల్యు కారు ప్రారంభధరే 93.90 లక్షల రూపాయలుంది. 1.07 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది.
BMW X5 xDrive40i xLine- 93.90 లక్షలు కాగా, BMW X5 xDrive40i M Sport- 1.05 కోట్లు, BMW X5 xDrive30d xLine- 95.90 లక్షలు, BMW X5 xDrive30d M Sport- 1.07 కోట్లుంది. 2023 మోడల్ బీఎండబ్ల్యూ ఎక్స్ 5 ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌టీరియర్‌లో అప్‌డేట్ తక్కువే ఉంటుంది. ఇందులో పాత మోడల్‌కు ఉన్నట్టే బీఎండబ్ల్యూ కిడ్నీ గ్రిల్ ఉంది. గిర్ల్ మూలల్లో రివైజ్డ్ ఎడాప్టివ్ మెట్రిక్స్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ క్లస్టర్ ఉంటుంది. ఇందులో బ్లూ కలర్ యాక్సెంట్, కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్ ఉంటుంది. ముందు భాగంలో బంపర్‌లో మార్పు చేశారు. ఇందులో ఎల్ షేప్డ్ ఇన్సర్ట్ ఉంటుంది.
వెనుక భాగంలో పెద్ద డిజైన్ ఉంది. బంపర్, టెయిల్ లైట్స్ ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యమైన అప్‌డేట్ కొత్త 21 ఇంచెస్ అల్లాయ్ వీల్ డిజైన్ ఉంది. ఇది కాకుండా ఇక కేబిన్ విషయంలో కొత్త ఎక్స్ 5 ఫేస్‌లిఫ్ట్‌లో 14.9 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ యూనిట్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. మధ్యభాగంలో గ్లాస్ ట్యాంగిల్ ఉంది.
బీఎండబ్ల్యూ ఎక్స్ 5లో 3.0 లీటర్, ఇన్‌లైన్ 6 సిలెండర్, టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, 3 లీటర్ ఇన్‌లైన్ 6 సిలెండర్, డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఉంది. రెండింట్లో 8 స్పీడ్ స్టెప్‌ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్నాయి. ఇందులో 487 వి మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. పెట్రోల్ ఎక్స్ 5 కేవలం 5.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. డీజిల్ అయితే కేవలం 6.1 సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
Also read; Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్, మొదటిరోజే ఊహించని బుకింగ్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook