LPG Price 1 Feb: దేశ ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశ పెడుతుంది. అయితే బడ్జెట్ ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ డే సందర్భంగా గృహ, వాణిజ్య LPG సిలిండర్ ధరల్లో మార్పులు వచ్చే అవకాశాలున్నాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. అయితే భారత్‌లో ప్రతి నెల LPG గ్యాస్ రేట్లకు సంబంధించిన ధరల్లో మార్పులు వస్తాయి. అయితే ఈ రోజు బడ్జెట్ ఉండడం వల్ల వాటి ధరల్లో కూడా తీవ్ర మార్పులు కూడా రాబోతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే బడ్జెట్ కారణంగా ఎలాంటి సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
2021లో బడ్జెట్ తర్వాత సిలిండర్ ధరలు దాదాపు రూ. 100కి పైగా పెంచారు. అయితే వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉండడం వల్ల ఈ సారి వాణిజ్య LPG సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు రాకపోవడం విశేషం. రాష్ట్రాల్లో ప్రస్తుత సిలిండర్ ధరల విషయనికొస్తే ఢిల్లీలో రూ.1769కాగా కోల్‌కతాలో రూ.1870కి అందుబాటులో ఉంది. ఇక ముంబైలో రూ.1721, చెన్నైలో రూ.1917 ఉంది.
ఫిబ్రవరిలో మూడుసార్లు సిలిండర్ ధర పెరిగాయి:
2021 బడ్జెట్ మూడు రోజుల తర్వాత LPG వినియోగదారులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. 2021లో ఫిబ్రవరి 4 LPG సిలిండర్ ధర రూ.25 పెరిగింది. అప్పుడు ఢిల్లీలో LPG ధరలు రూ.694 నుంచి రూ.719కి పెరిగాయి. అంతేకాకుండా దాదాపు దీని తర్వాత రెండు నుంచి మూడు సార్లు పెరిగిన సంగతి తెలిసిందే. 2021లో బడ్జెట్ ప్రవేశపెట్టిన 11 రోజుల తర్వాత సిలిండర్ ధర మళ్లీ పెరిగాయి. అయితే అప్పుడు రూ.50 పెంచగా LPG ధర ఒక్కసారిగా రూ.769కి చేరింది. సరిగ్గా 10 రోజుల తర్వాత మళ్లీ డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.25 పెంచింది. దీంతో ధర రూ.794కి చేరింది.
ఈ సంవత్సరం LPG వినియోగదారులకు బడ్జెట్ ఆశ జనకంగానే ఉండబోతోంది. అయితే ప్రతి సంవత్సరం లాగా ఈ సారి LPG ధరలు రేట్లలో మార్పులు వచ్చి పెరిగే అవకాశాలు లేవని నిపుణులు పేర్కోన్నారు. ఇక 2022 బడ్జెట్ తర్వాత కూడా 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధరపై కేంద్ర ధర రూ.25 పెంచింది. గత ఏడాదిలో ఢిల్లీలో గృహోపకరణాల గ్యాస్ సిలిండర్ ధర దాదాపు రూ.153.5 పెరిగింది.
2022 సంవత్సరంలో 14.2 కిలోల LPG సిలిండర్ రేటులో మార్పులు:
2021 అక్టోబర్ 6 లో రూ. 15 పెంపు.
2022 మార్చి 22లో రూ. 50 పెంపు.
2022 మే 7 లో రూ. 50 పెంపు.
2022 మే19 లో రూ. 350 పెంపు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook