Smart Phones Under 20,000 Rupees: ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలంటే కనీసం 40 వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో బడ్జెట్ వెచ్చించాల్సి ఉంటుంది. అయితే, అందరికీ అంత భారీ బడ్జెట్ పెట్టాలి అంటే కుదరదు కనుక.. తక్కువ బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్స్ పైనే అందరి దృష్టి ఉంటుంది. ఇప్పుడు మేం మీకు అలాంటి ఫోన్స్ వివరాలనే చెప్పబోతున్నాం. అవును, రూ 20 వేల లోపు ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ డీటేల్స్ ఇదిగో.
లావా అగ్ని 2:
లావా అగ్ని 2 స్మార్ట్‌ఫోన్ ఈమధ్యే మార్కెట్లోకి లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర రూ.19,999 గా నిర్ణయించారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 SoC ప్రాసెసర్ అమర్చారు. ఈ బడ్జెట్లో మరే ఇతర ఫోన్లకు లేని విధంగా డ్యూయల్ కర్వ్‌డ్ డిజైన్ ఈ ఫోన్లో లభిస్తుంది. ఇది 6.78-అంగుళాల FHD + అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 OS ఆధారంగా రన్ అవుతుంది. వెనుక భాగంలో 50MP కెమెరాను అమర్చారు. 8GB RAM + 256GB స్టోరేజీ లభిస్తుంది. నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ కోసం 4700 mAh బ్యాటరీని అమర్చారు.
మోటో G82 5G:
మోటో G82 5G మొబైల్ గతేడాది లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.60 అంగుళాల డిస్‌ప్లేను అమర్చారు. 1080x2400 పిక్సెల్స్ FHD + రిజల్యూషన్‌తో స్క్రీన్ క్లియర్ వ్యూని అందిస్తుంది. మోటో G82 5G ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 6GB RAM, 8GB RAM అంటూ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. మోటో G82 5G ఆండ్రాయిడ్ 12 ఆధారంగా రన్ అవుతుంది. 5000mAh బ్యాటరీ సహాయంతో నడిచే ఈ ఫోన్ ధర రూ.19,999 గా ఉంది.
వన్ ప్లస్ నార్ CE 3 లైట్ 5G:
వన్ ప్లస్ బ్రాండ్ అంటేనే ప్రీమియం ఫోన్లకు పెట్టింది పేరు. అలాంటి వన్ ప్లస్ బ్రాండ్ నుంచి తక్కువ ధరలో లభించే ఫోన్ ఈ వన్ ప్లస్ నార్ CE 3 లైట్ 5G. వన్ ప్లస్ బ్రాండ్ లో లభించే ఈ బేసిక్ వేరియంట్ ఫోన్ రూ.19,999 కే లభిస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో రూపొందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ముందు భాగంలో అందమైన సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. అలాగే వెనుక భాగంలో 108MP మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ అందించబడింది.
ఇది కూడా చదవండి: How To Earn More Money on Youtube: యూట్యూబ్‌లో ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా ?
వివో T2 5G:
వివో T2 5G స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో లభిస్తోంది. అందులో ఒకటి 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కాగా.. రెండోది 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ఫోన్. స్నాప్‌డ్రాగన్ 695 5G SoC ప్రాసెసర్ తో నడిచే ఈ ఫోన్ వెనుక భాగంలో 64 MP కెమెరా సెటప్ ఉంది. 4,500mAh బ్యాటరీని అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఇంకాస్త తక్కువ ధరలోనే.. అంటే రూ. 18,999 కే మీ సొంతం చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్స్ ప్లస్ మంచి కెమెరా క్వాలిటీ కలిగిన ఫోన్స్ కోసం చూసే వారు వీటిని ట్రై చేయొచ్చు అంటున్నారు స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఎక్స్‌పర్ట్స్.
ఇది కూడా చదవండి: Hyundai Exter: స్విఫ్ట్, ఐ10 ధరకే హ్యుండయ్ నుంచి కొత్త మైక్రో ఎస్‌యూవీ, 6 ఎయిర్‌బ్యాగ్స్ ఎస్‌యూవీ కేవలం 6 లక్షలకే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook