ట్విట్టర్ సీఈవో, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. ట్విట్టర్ సీఈవో బాధ్యతల్నించి వైదొలగుతానని చెప్పడమే కాకుండా..ఈ పదవికి సరిపోయే మూర్ఖుడు దొరికేంతవరకూ కొనసాగుతానని చెప్పుకొచ్చారు.
ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి కీలక ప్రకటన చేశారు. ఇటీవల తన సొంత వేదికలో సీఈవోగా తాను కొనసాగాలా వద్దా అనే విషయంలో ఆయనకు ఆయనే పోల్ నిర్వహించారు. ఈ పోల్‌లో 57.5 శాతం మంది వైదొలగాలని..మిగిలినవారు కొనసాగాలని ఓటేశారు. ఈ పోల్‌కు స్పందనగా ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ సీఈవోగా చేరేందుకు సరిపోయే మూర్ఘుడు దొరికిన వెంటనే సీఈవో పదవికి రాజీనామా చేస్తానని ట్వీట్ చేశారు. తాను సాఫ్ట్వేర్, సర్వర్ బృందాల్ని చూసుకుంటానన్నారు.
44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ కొనుగోలు తరువాత ఎలాన్ మస్క్ వివిధ నిర్ణయాలతో వివాదాస్పదమయ్యారు. సగం మంది సిబ్బందిని హఠాత్తుగా తొలగించడం, వెరిఫైడ్ ఎక్కౌంట్లకు డబ్బులు వసూలు చేయడం వంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు.
I will resign as CEO as soon as I find someone foolish enough to take the job! After that, I will just run the software & servers teams.
— Elon Musk (@elonmusk) December 21, 2022
మరో మూర్ఖుడు దొరికిన వెంటనే సీఈవో పదవి నుంచి తప్పుకుంటానని ఎలాన్ మస్క్ ప్రకటనట్ చేయడంపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్ సంస్థ సీఈవోగా వ్యవహరించే వ్యక్తిని మూర్ఖుడని భావిస్తున్నారా లేదా మూర్ఖుడిని తీసుకొచ్చి ఆ పదవిలో నియమిస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.
Also read: 7th Pay Commission: 18 నెలల పెండింగ్ డీఏపై కేంద్రం కీలక ప్రకటన.. రాజ్యసభలో ఏం చెప్పిందంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook