Facebook Compensation: ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఫేస్బుక్..యూజర్లకు 30 వేలకు పైగా పరిహారం చెల్లిస్తోంది. అది కూడా పది లక్షలకు పైగా యూజర్లకు. ఆశ్యర్యంగా ఉందా..ఎందుకు, ఎవరికి చెల్లించనుందో తెలుసుకుందాం..
వాస్తవానికి ఫేస్‌బుక్‌పై ప్రైవసీ చట్టం ఉల్లంఘించిందనే ఆరోపణలున్నాయి. కంపెనీకు వ్యతిరేకంగా 2015లో కేసు నమోదైంది. యూజర్లకు తెలియకుండా వారి బయోమెట్రిక్ డేటాను ఇతరులకు షేర్ చేసిందనేది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు పది లక్షలకు పైగా యూజర్లకు ఫేస్బుక్ 397 యూఎస్ డాలర్లను చెల్లించనుంది. యూజర్ల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు షేర్ చేసినందుకు ఒక్కొక్కరికి 30 వేల 785 రూపాయలు నష్టపరిహారం చెల్లించనుంది.
ఈ కేసు 2015లో ఫేస్‌బుక్‌పై నమోదైంది. గత కొద్దికాలంగా సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆరోపణలు ఎదుర్కొంది. ఈ వ్యవహారంలో జరిగిన ఓ ఒప్పందం ప్రకారం 650 మిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించేందుకు కంపెనీ అంగీకరించింది. ఆ తరువాత ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను విరమించుకున్నట్టు కూడా ప్రకటించింది. ఎవరైతే అప్పటికే ఆప్ట్ చేసుకున్నారో..వారి ఫోటోలు, వీడియోలు ఇతరుల ముఖాన్ని గుర్తు పట్టే వ్యవస్థ నుంచి తొలగించనున్నారు.
ఫేస్బుక్ కంపెనీ 2010 నుంచి ఫోటో ట్యాగింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తోంది. ఈ టెక్నిక్ కారణంగా ఫోటోను చాలా సులభంగా ట్యాగ్ చేయవచ్చు. నెమ్మది నెమ్మదిగా కంపెనీ పలు దేశాల్నించి ఏ విధమైన అనుమతి లేకుండానే యూజర్ల డేటాను షేర్ చేస్తుందనే ఆరోపణలు విస్తరించి..చివిరికి కేసు నమోదుకు దారి తీసింది. ఇప్పుడు వారందరికీ కంపెనీ పరిహారం చెల్లించబోతోంది.
Also read: Ktr London Tour: తెలంగాణకు మరో మణిహారం..కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.