First Cry IPO Latest News: ప్రస్తుతం ఐపిఓ మార్కెట్ సందడిగా ఉండి ఇప్పటికే పలు సంస్థలకు చెందిన ఐపివోలు మంచి రిటర్న్ అందిస్తున్నాయి. తాజాగా లిస్ట్ అయినటువంటి ఐపిఓల్లో 100% ప్రీమియం అందించిన ఐపివోలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా మరో సంస్థ కూడా ఐపిఓ మార్కెట్లోకి ప్రవేశిస్తుంది. దీంతో ప్రైమరీ మార్కెట్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి ఇన్వెస్టర్లకు ఉత్సాహం నింపుతోంది. పసిపిల్లలకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే ఫస్ట్ క్రై ఐపిఓ ద్వారా మార్కెట్లోకి ప్రవేశిస్తుంది.దీనిపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ క్రై ఐపిఓ కి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రముఖ ఆన్‌లైన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫస్ట్‌క్రై మాతృ సంస్థ బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఆగస్టు 6న తన IPOను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. IPO కోసం దాఖలు చేసిన పత్రాల ప్రకారం, మూడు రోజుల పాటు ఉండే ఈ పబ్లిక్ ఇష్యూ ఆగస్టు 8 న ముగుస్తుంది.యాంకర్ ఇన్వెస్టర్లు ఆగస్టు 5న షేర్ల కోసం బిడ్స్ వేస్తారు. పుణెకు చెందిన బ్రెయిన్‌బిజ్ సొల్యూషన్స్ ఈ IPOలో, 1,666 కోట్ల రూపాయల విలువైన కొత్త షేర్లు 5.44 కోట్ల షేర్లు ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించనుంది. IPO ధర బ్యాండ్ గురువారం ప్రకటించనుంది.
Read Also : Ponnaganti Kura Health Benefits: పొన్నగంటి కూరలో పుట్టెడు పోషకాలు..కంటిచూపు పదునెక్కడం ఖాయం..!!
FirstCry లో ఉన్న 37.35% షేర్లను విక్రయించనున్నారు.ఇందులో సాఫ్ట్‌బ్యాంక్ ప్రధానంగా తన షేర్లను విక్రయిస్తోంది. ఇతర స్టాక్ విక్రేతలలో M&M (మహీంద్రా & మహీంద్రా), ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, TPG గ్రోత్ న్యూక్వెస్ట్ ఆసియా ఉన్నాయి. ఫస్ట్‌క్రైలో 25.53% వాటాతో సాఫ్ట్‌బ్యాంక్ అతిపెద్ద వాటాదారు, మహీంద్రా అండ్ మహీంద్రా 10.97%, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ 10.36%, కంపెనీ వ్యవస్థాపకురాలు సుపమ్ మహేశ్వరి 6% షేర్లను కలిగి ఉన్నారు.
కంపెనీ క్వార్టర్ ఫలితాలు ఎలా ఉన్నాయి:
ఫస్ట్‌క్రై ఆదాయం 2023-24 మధ్య కాలంలో రూ.5,633 కోట్ల నుంచి 15% పెరిగి రూ.6,481 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఫస్ట్‌క్రై ప్రధాన ఆదాయం కంపెనీ ఉత్పత్తులను ఆఫ్‌లైన్ స్టోర్‌లు, వెబ్‌సైట్ ద్వారా ఉత్పత్తులను విక్రయించడం ద్వారా పొందుతోంది. ఫస్ట్ క్రై అనుబంధ సంస్థ గ్లోబల్‌బిజ్ సైతం గత ఏడాది రూ. 1,209 కోట్లు ఆదాయం పొందింది.
Read Also : Car Insurance: ఈ వర్షాకాలం కారు డ్యామేజ్ అవుతుందని భయమా? అయితే ఏ బీమా పాలసీ ఎంచుకుంటే లాభమో తెలుసుకోండి.!!
Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
First cry IPO: మార్కెట్లోకి ఫస్ట్ క్రై ఐపీఓ..ప్రారంభం ఎప్పుడంటే..?