February 26 2022 Gold and Silver Rates in Hyderabad: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కావడంతో ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. మళ్లీ భారీగా తగ్గుతూ వస్తున్నాయి. గురువారం రూ.2 వేల స్థాయిలో పెరిగిన బంగారం ధర.. శుక్రవారం వెయ్యి రూపాయలకుపైగా తగ్గి 51 వేలకు అటుఇటుగా పడిపోయింది. ఇక శనివారం (ఫిబ్రవరి 26) కూడా బంగారం ధర మరింత తగ్గింది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగితే.. బంగారం ధరలు భారీగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేశారు. అయితే అందుకు బిన్నంగా బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. అంతర్జాతీయంగా డిమాండ్ లేకపోవడం, రూపాయి బలపడటంతో దేశీయంగా ధరలు భారీగా తగ్గాయి. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం)పై రూ.400 తగ్గి రూ.46,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.440 తగ్గి రూ.51,110 గా ఉంది. కిలో వెండి ధర రూ. 65,000గా ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,260 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110గా ఉంది. వాణిజ్య నగరం ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.46,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,110గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.48,010లుగా.. 24 క్యారెట్ల ధర రూ.52,370 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.46,850గా.. 24 క్యారెట్ల ధర రూ.51,110 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.46,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,110హా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,110గా కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.46,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,110 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.46,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,110 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,000లుగా ఉండగా.. విజయవాడలో రూ.70,000, విశాఖపట్నంలో రూ.70,000 లుగా కొనసాగుతోంది.
Also Read: Horoscope 2022 February 26: నేటి రాశిఫలాలు.. ఇష్టదైవాన్ని వేడుకుంటే మరిన్ని శుభ ఫలితాలు
Also Read: PKL8 Final: ఫైనల్లో పట్నా చిత్తు... తొలిసారి టైటిల్‌ను ముద్దాడిన దబాంగ్ ఢిల్లీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook