Gold Price Today in Hyderabad: బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

Gold Price Today in Hyderabad  | చాలా రోజుల తర్వాత బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మిశ్రమంగా ఉన్నాయి. అయితే వెండి ధరలు మాత్రం భారీ పంజుకున్నాయి. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే.

Last Updated : Nov 3, 2020, 07:30 AM IST
Gold Price Today in Hyderabad: బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు యథాతథంగా కొనసాగగా, ఢిల్లీలో మాత్రం ధర పెరిగింది. మరోవైపు నిన్న పతనమైన వెండి ధరలు నేడు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,920గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,610 వద్ద మార్కెట్ అవుతోంది.

 

ఢిల్లీ (Delhi) మార్కెట్‌లో ఇటీవల వరుసగా దిగొచ్చిన బంగారం ధరలు (Gold Rate in Delhi) నేడు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.730 మేర పెరగడంతో  10 గ్రాముల ధర రూ.52,670కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,200గా ఉంది.

 

బులియన్ మార్కెట్‌లో నిన్న తగ్గిన వెండి ధరలు (Silver Rate in India) నేడు భారీగా పెరిగాయి. తాజాగా బులియన్ మార్కెట్‌లో వెండి ధర రూ.1,600 మేర పుంజుకుంది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.61,700కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఒకే ధరలో మార్కెట్ అవుతోంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News