Todays Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: పసిడి ప్రియులకు కాస్త నిరాశ కల్గించే వార్త ఇది. దేశంలో బంగారం ధర మరోసారి స్వల్పంగా పెరిగింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 27, 2021, 07:45 AM IST
Todays Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: పసిడి ప్రియులకు కాస్త నిరాశ కల్గించే వార్త ఇది. దేశంలో బంగారం ధర మరోసారి స్వల్పంగా పెరిగింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం ధరలు గత కొద్దిరోజులుగా స్థిరంగా కొనసాగుతున్నా..ఇవాళ మరోసారి స్వల్పంగా పెరిగాయి. మార్కెట్ పరిణామాలు, డాలర్ విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీ రేటు వంటివి బంగారం ధరలపై (Gold Rate) ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే ప్రతిరోజూ బంగారం ధరలు మారుతుంటాయి. దేశంలోని వివిధ నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 510 రూపాయలుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51 వేల 810గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 310 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 310 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 520 రూపాయలైతే..24 క్యారెట్ల  బంగారం 10 గ్రాముల ధర 49 వేల 660 రూపాయలుగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 360 రూపాయలుంది. అటు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 490 రూపాయలుగా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో (Hyderabad Gold Price) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 360 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 490 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 360 రూపాయలైతే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 490 రూపాయలుంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇదే ధర ఉంది. 

Also read: Banking alert: జనవరి 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్​- ఏటీఎం లావాదేవీలకు అదనపు ఛార్జీలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి ​Twitter , Facebook

Trending News