HDFC Bank: అమ్మకానికి హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్స్ డేటా ? స్పందించిన బ్యాంకు

HDFC Bank Customers Data Leak: శాంపిల్స్ రూపంలో కొంతమేరకు సమాచారాన్ని డిస్‌ప్లే చేస్తున్న సైబర్ క్రిమినల్స్.. పూర్తి సమాచారం ఇవ్వాలంటే డబ్బు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ సోమవారం మరో పరిణామం చోటుచేసుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2023, 11:21 PM IST
HDFC Bank: అమ్మకానికి హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్స్ డేటా ? స్పందించిన బ్యాంకు

HDFC Bank Customers Data Leak: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్ల డేటా లైక్ అయిందనే వార్త ఆ బ్యాంకులో ఖాతా ఉన్న ఎకౌంట్ హోల్డర్స్ ని ఆందోళనకు గురిచేసింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు చెందిన 6 లక్షల మంది ఖాతాదారుల పర్సనల్ డేటా డార్క్ వెబ్‌లో లీక్ అయిందన్న వార్తలపై కస్టమర్స్ ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో తాజాగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ ఈ వివాదంపై స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ కస్టమర్ల డేటా లీక్ అవలేదని బ్యాంకు తమ తాజా ప్రకటనలో పేర్కొంది. 

ట్విట్టర్‌ ద్వారా ఈ వివాదంపై స్పందించిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, " తమ బ్యాంక్ సర్వర్స్‌లో ఎలాంటి డేటా బ్రీచ్ జరగలేదని.. ఎవ్వరూ ఎలాంటి అనధికారిక పద్ధతిలో తమ సర్వర్స్‌లోకి ప్రవేశించలేదు" అని స్పష్టం చేసింది. మా సిస్టమ్స్‌పై మాకు నమ్మకం ఉందని.. అయినప్పటికీ కస్టమర్స్ డేటా సేఫ్టీ కోసం భద్రతా పరమైన అంశాల్లో రాజీపడే ప్రసక్తే లేదని కంపెనీ పేర్కొంది. ఇదిలావుంటే, ప్రైవసీ ఎఫైర్స్ అనే వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్ల డేటా డార్క్ వెబ్ అనే హ్యాకర్స్ ఫోరంలో లీక్ అయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రకటన ఇలా ఉన్నప్పటికీ.. లీక్ అయిన డేటాలో కస్టమర్స్‌కి సంబంధించిన పూర్తి పేర్లు, ఇమెయిల్ అడ్రస్, ఇంటి అడ్రస్‌తో పాటు ఇతర కీలక సమాచారం కూడా అందుబాటులో ఉందని వార్తలు వెలువడుతున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుంచి సేకరించిన ఆ సమాచారాన్ని సైబర్ క్రిమినల్స్ డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

శాంపిల్స్ రూపంలో కొంతమేరకు సమాచారాన్ని డిస్‌ప్లే చేస్తున్న సైబర్ క్రిమినల్స్.. పూర్తి సమాచారం ఇవ్వాలంటే డబ్బు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ సోమవారం మరో పరిణామం చోటుచేసుకుంది. కొంతమంది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్స్ తమకు మొబైల్ యాప్ ద్వారా, ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు జరిపే సమయంలో పలు అవాంతరాలు ఎదుర్కొన్నామని చెబుతూ ట్విటర్‌లో తమకు ఎదురైన అనుభవాలను పోస్ట్ చేయడం గమనార్హం.

ఇది కూడా చదవండి : Maruti to Mahindra: ఏ బ్రాండ్ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయంటే..

ఇది కూడా చదవండి : E-Aadhaar Card Download: ఆధార్ నెంబర్ లేకున్నా.. ఈ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండిలా

ఇది కూడా చదవండి : Old Vehicles Seizing: ఆ నెంబర్ సిరీస్ వాహనం కనిపిస్తే చాలు సీజ్.. ఇప్పటికే 800 వాహనాలు సీజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News