IRCTC Ticket Booking: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్, ఇకపై చాట్ బోట్ ద్వారా టికెట్ బుకింగ్ సౌకర్యం

IRCTC Ticket Booking: దేశంలోని కోట్లాది రైల్వే ప్రయాణికులకు ఇది గుడ్‌న్యూస్. రైల్వే టికెట్ బుకింగ్ ఇప్పుడు మరింత సులభం కానుండటమే కాకుండా..లబ్ది కూడా చేకూరనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 15, 2022, 08:04 PM IST
IRCTC Ticket Booking: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్, ఇకపై చాట్ బోట్ ద్వారా టికెట్ బుకింగ్ సౌకర్యం

IRCTC Ticket Booking: దేశంలోని కోట్లాది రైల్వే ప్రయాణికులకు ఇది గుడ్‌న్యూస్. రైల్వే టికెట్ బుకింగ్ ఇప్పుడు మరింత సులభం కానుండటమే కాకుండా..లబ్ది కూడా చేకూరనుంది.

భారతీయ రైల్వే..ప్రయాణీకులకు శుభవార్త విన్పిస్తోంది. ఇక నుంచి రైల్వే రిజర్వేషన్‌ను మరింత సులభంగా చేసుకోవచ్చు. టికెట్ బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ యాప్‌లో వెళ్లాల్సిన అవసరం లేదు. యాప్‌లో లాగిన్ కాకుండానే టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..

ఐఆర్సీటీసీ రైల్వే ప్రయాణీకులకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తోంది. ఐఆర్సీటీసీ చాట్ బోట్ ద్వారానే రిజర్వేషన్ చేయించుకోవచ్చు. ప్రయాణీకుల కోసం రైల్వే శాఖ ఈ ప్రత్యేక వెసులుబాటు ప్రారంభించింది. ఈ సౌకర్యం ఇటీవలే ప్రారంభమైంది. దీనిద్వారా చాలా సులభంగా మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు.

ఐఆర్సీసీటీ వెబ్‌సైట్ ప్రకారం ప్రస్తుతం దాదాపు 10 లక్షలకు పైగా జనం వెబ్‌సైట్ ద్వారా ప్రతిరోజూ రిజర్వేషన్ చేయిస్తున్నారు. ఇది కాకుండా యాప్, స్టేషన్ ద్వారా కూడా టికెట్ బుకింగ్ చేస్తుంటారు. చాలా సార్లు వెబ్‌సైట్ సరిగ్గా పనిచేయక ఇబ్బందులు పడుతుంటారు. ఈ పరిస్థితిని చూసి రైల్వే శాఖ చాట్ బోట్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ సౌకర్యం ద్వారా టికెట్ బుకింగ్‌కు అదనంగా ఛార్జ్ ఏదీ లేదు. వెబ్‌‌సైట్ బుకింగ్ కోసం ఎంత చెల్లిస్తారో అదే ఉంటుంది. 

టికెట్ బుకింగ్ సమయంలో స్లీపర్ తరగతికి 10 రూపాయలు, ఏసీకు 15 రూపాయలు చెల్లిస్తుంటారు. అదే విధంగా యూపీఐ పేమెంట్ ద్వారా స్లీపర్ తరగతికి 20 రూపాయలు, ఏసీకు 30 రూపాయలు ఛార్జ్ ఉంటుంది.

Also read: Interest Rates: సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ వడ్డీ రేట్లలో మార్పు, ఎంత పెరగనుందంటే..??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News