Insurance New Rules: ఇన్సూరెన్స్ పాలసీలో జనవరి 1 నుంచి మారిన నిబంధనలు, లేకపోతే మనీ లాండరింగ్ వంటి సమస్యలు

Insurance New Rules: కొత్త ఏడాది ప్రారంభం కాగానే జీవితంలో చాలా విషయాల్లో మార్పు వస్తుంటుంది. అదే సమయంలో ఆర్ధిక సంబంధిత వ్యవహారాల్లో కూడా చోటుచేసుకునే మార్పుల్ని కచ్చితంగా పరిశీలించుకోవాలి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 3, 2023, 04:40 PM IST
Insurance New Rules: ఇన్సూరెన్స్ పాలసీలో జనవరి 1 నుంచి మారిన నిబంధనలు, లేకపోతే మనీ లాండరింగ్ వంటి సమస్యలు

అదే విధంగా 2023 కొత్త ఏడాది అంటే జనవరి 1 నుంచి పాలసీ హోల్డర్లకు సంబంధించి కొత్త నిబంధనలు అమలవుతున్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఈ కొత్త నిబంధనలు ఇలా ఉన్నాయి.

ఐఆర్‌డీఏఐ 2023 జనవరి 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఈ నిబంధనల ప్రకారం పాలసీ హోల్డర్లు అంటే వివిధ రకాల ఇన్సూరెన్స్ తీసుకున్నవాళ్లు తప్పనిసరిగా కేవైసీ సమాచారం సమర్పించాల్సి ఉంటుంది. ఫలితంగా ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద పాలసీ హోల్డర్లకు సంబంధించి సరైన, కచ్చితమైన సమాచారం ఉంటుంది. 

కేవైసీ సమాచారం అవసరమేంటి

కేవైసీ సమాచారం ఇవ్వడం వల్ల పాలసీ హోల్డర్లు తమ ఇన్సూరెన్స్ కవరేజ్, ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చు. అదే సమయంలో మనీ లాండరింగ్, మోసం నుంచి రక్షించుకోవచ్చు. ఇన్సూరెన్స్ కవరేజ్ విషయంలో ఎదురయ్యే సమస్యలు, జాప్యాన్ని కేవైసీ ద్వారా నివారించవచ్చు.

ప్రస్తుతం ఉన్న నిబంధన

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 1 లక్షల రూపాయల కంటే ఎక్కువున్న క్లెయిమ్స్‌కు మాత్రమే కేవైసీ డాక్యుమెంటేషన్ అవసరమౌతుంది. కొత్త ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ ప్రకారం పాలసీ తీసుకునేటప్పుడు కేవైసీ డాక్యుమెంటేషన్ అవసరమౌతుంది. 

Also read: Kia Cars New Price: కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన కియా.. ఈ కారు కొనడానికి లక్ష అదనంగా చెలించాల్సిందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News