Moto G22: దేశంలో కొవిడ్ సంక్షోభం భారీగా తగ్గిన నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు జోరు పెంచాయి. వరుసగా కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవాకు చెందిన మోటొరోలా.. నేడు బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ఫోన్న్ను విడుదల చేసింది. మోటో జీ22 పేరుతో విడుదల చేసిన ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మోటో జీ22 ఫీచర్లు..
ఈ ఫోన్‌ను బడ్జెట్ ధరలో తెచ్చినప్పటికీ.. ప్రీమియం ఫీచర్లు పొందుపరచడం విశేషం. 6.53 అంగుళాల భారీ డిస్ప్లేతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇది హెచ్డీ ప్లస్ (1600x720 పిక్సెల్ రెసొల్యూషన్) పిక్చర్ క్వాలిటీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది.
వెనకవైపు నాలుగు కెమెరాలు ఉంటాయి. అందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్‌తో రానుంది. మిగతా లెన్స్‌లు 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్‌గా ఉండనున్నాయి.
ఇందులో 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను పొందు పరిచింది మోటోరోలా.
ఇక ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని పొందుపరిచింనట్లు చెప్పింది మోటోరోలా. ఇది 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
ఆండ్రాయిడ్ 12 స్టాక్ ఆండ్రాయిడ్‌పై పని చేస్తుంది. అంటే ఈ ఫోన్లో యాడ్స్ రావు.
It’s time to meet the #MasterOfAll! The all-new, feature-packed #motog22 is here. Get ready, sale starts 13th April on @Flipkart at just 10,999. Exclusive launch offer of ₹9,999* till 14th April! #gomotog Know more: https://t.co/FAHMq2UsUl pic.twitter.com/K67dvfWtbr
— Motorola India (@motorolaindia) April 8, 2022
ధర ఎంత?
4 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.10,999గా నిర్ణయించింది కంపెనీ. అయితే ఆరంభ ఆఫర్ కింద రూ.9,999కి తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఏప్రిల్ 13 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభం కానున్నాయి.
Also read: Stock Markets: మూడు రోజుల నష్టాలకు బ్రేక్- బ్యాంకింగ్ షేర్ల అండతో లాభాలు..
Also read: Google Play Store: ప్లేస్టోర్‌లో అప్‌డేట్ ఇవ్వని యాప్‌లకు గూగుల్ షాక్...!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook