Investment rules: కొత్త ఆర్ధిక సంవత్సరం ఇవాళ ఏప్రిల్ 1 నుంచి పెట్టుబడులు పెట్టాలనుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చాలా అంశాల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. వడ్డీ రేట్లు మారుతున్నాయి. కొన్ని నియమాలు వచ్చి చేరుతున్నాయి.
మహిళల కోసం స్మాల్ సేవింగ్ స్కీమ్ మహిళా సమ్మాన్ బచత్ పత్ర ప్రారంభమైంది. ఇందులో ఎవరైనా మహిళ లేదా అమ్మాయి పేరుపై 2 లక్షల రూపాయల వరకూ ఒకసారి పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్‌పై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పధకం ఇవాళ్టి నుంచే ప్రారంభమైంది.
ఇక ఇన్సూరెన్స్ విషయంలో 5 లక్షల వార్షిక ప్రీమియం కంటే ఎక్కువ బీమా పాలసీపై లభించే నగదుపై మినహాయింపు పరిమితి తొలగించేసింది ప్రభుత్వం. ఏప్రిల్ 2023 తరువాత జారీ అయిన అన్ని జీవిత బీమా పాలసీల మెచ్యూరిటీ నగదుపై ట్యాక్స్ పడుతుంది. ప్రీమియం ఐదేళ్ల కంటే ఎక్కువగా ఉంటేనే.
విశిష్ట నాగరిక బచత్ యోజన కింద జమ చేసే నగదు పరిమితి 15 లక్షల రూపాయల్నించి 30 లక్షలకు పెరిగింది. అదే విధంగా నెలసరి పరిమితి 9 లక్షలకు పెరిగింది.
బాండ్లు
ఏప్రిల్ నుంచి బాండ్లు లేదా నిశ్చిత ఆదాయం కలిగిన ఉత్పత్తుల్లో పెట్టుబడికి సంబంధించి మ్యూచ్యువల్ ఫండ్‌లో తాత్కాలిక లాభముంటుంది. ఇప్పటి వరకూ ఈ పధకంపై ఇన్వెస్టర్లకు దీర్ఘకాలిక లాభం కలిగేది. ఫలితంగా ఈ పధకం బాగా ఆదరణ పొందింది. ప్రస్తుతంత బాండ్లు లేదా నిశ్చిత ఆదాయం ఇచ్చే స్కీమ్స్‌కు సంబంధించిన ఫండ్‌లో పెట్టుబడి పెట్టేవాళ్లు మూడేళ్ల వరకూ పెట్టుబడిపై వచ్చే లాభంపై ట్యాక్స్ చెల్లిస్తున్నారు. మూడేళ్ల తరువాత దీనిని తొలగించి 20 శాతం లేదా ధరల పెరుగుదల ప్రభావంతో 10 శాతం చెల్లింపు ఉంటుంది.
Also read: LPG Gas Cylinder Rates: భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర, ఇవాళ్టి నుంచి కొత్త గ్యాస్ ధరలు ఇవీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook