Fake Passport Alert: పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసే వాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం

Fake Passport Alert: మోసగాళ్లు కూడా పాస్‌పోర్ట్ అనే పేరును తమ వెబ్‌సైట్ డుమెయిన్‌గా ఉపయోగిస్తుండటంతో ఆ విషయం తెలియని దరఖాస్తుదారులు అక్కడే అప్లికేషన్ ఫారం నింపి, డబ్బు చెల్లించి ఫేక్ వెబ్‌సైట్స్ చేతిలో మోసపోతున్నారు. 

Written by - Pavan | Last Updated : Feb 22, 2023, 07:04 PM IST
Fake Passport Alert: పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసే వాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం

Fake Passport Alert: మీరు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా ? ఇంటర్నెట్‌లోకి వెళ్లి  ఆన్‌లైన్ ద్వారా పాస్‌పోర్ట్ కోసం అప్లై చేస్తున్నారా ? పాస్‌పోర్ట్ కోసం వెబ్‌సైట్లో అడిగిన వివరాలు అన్నీ ఇచ్చి అప్లికేషన్ ఫీజు చెల్లిస్తున్నారు కదా ? అయితే తస్మాత్ జాగ్రత్త.. లేదంటే మీకు పాస్‌పోర్ట్ రాకపోగా.. భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. అంతటితో అయిపోలేదు.. మీ టైమ్ బాగోలేకపోతే.. మీరు మరిన్ని చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంది . అదెలా అంటారా ? అయితే పాస్‌పోర్ట్ అప్లికెంట్స్‌ని అప్రమత్తం చేస్తూ కేంద్రం జారీ చేసిన ఈ వివరాల గురించి మీరు తెలుసుకోవాల్సిందే.

పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసే వారిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఓ ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. కొంతమంది దరఖాస్తుదారులు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి ఫేక్ వెబ్‌సైట్స్‌ని ఆశ్రయించి మోసపోతున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని.. అధికారిక వెబ్‌సైట్‌కి బదులుగా తమకు తెలియకుండానే ఇంటర్నెట్లో కనిపించే ఫేక్‌ వెబ్‌సైట్లో పాస్‌పోర్ట్ అప్లికేషన్ ఫారం ఫిల్ చేసి వారు అడిగిన వ్యక్తిగత వివరాలు, డాక్యుమెంట్స్‌తో పాటు భారీ మొత్తంలో ఫీజు కూడా చెల్లించి మోసపోతున్నారని కేంద్రం హెచ్చరించింది. 

పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసే దరఖాస్తుదారులు మోసపోకుండా అప్రమత్తం చేసిన కేంద్రం.. ఇంటర్నెట్‌లో జనాన్ని మోసం చేస్తోన్న ఫేక్ వెబ్‌సైట్స్ వివరాలను సైతం వెల్లడించింది. కేంద్రం విడుదల చేసిన పాస్‌పోర్ట్ అప్లికేషన్ ఫేక్ వెబ్‌సైట్స్ జాబితా ఇలా ఉంది.

www.indiapassport.org
www.online-passportindia.com
www.passportindiaportal.in
www.passport-india.in
www.passport-seva.in
www.applypassport.org 

ఇవే కాకుండా ఇంకొన్ని ఫేక్ వెబ్‌సైట్స్, ఫేక్ మొబైల్ యాప్స్‌లోనూ జనం పాస్‌పోర్ట్ అప్లికేషన్ నింపి మోసపోతున్నారు. ఇలా చేయడం వల్ల మోసగాళ్ల చేతుల్లోకి మీ విలువైన పర్సనల్ డాక్యుమెంట్స్, డేటా వెళ్లిపోవడమే కాకుండా.. మీరు చెల్లించే ఫీజు, పేమెంట్ చేయడానికి ఉపయోగించే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల వివరాలు సైతం లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. ఏవైనా అధికారిక వెబ్‌సైట్స్‌లో డబ్బులు చెల్లించే వారి భద్రత కోసం పేమెంట్ గేట్వేల ద్వారా సెక్యురిటీ కల్పిస్తారు. కానీ ఫేక్ వెబ్‌సైట్స్‌లో సెక్యురిటీ లేకపోగా.. ఆ మోసగాళ్లే పనిగట్టుకుని మరీ మీ పేమెంట్ డీటేల్స్ సేకరించే ప్రమాదం ఉంది. 

మోసగాళ్లు కూడా పాస్‌పోర్ట్ అనే పేరును తమ వెబ్‌సైట్ డుమెయిన్‌గా ఉపయోగిస్తుండటంతో ఆ విషయం తెలియని దరఖాస్తుదారులు అక్కడే అప్లికేషన్ ఫారం నింపి, డబ్బు చెల్లించి ఫేక్ వెబ్‌సైట్స్ చేతిలో మోసపోతున్నారు. ఈ కారణంగానే ప్రజాప్రయోజనార్థం కేంద్రం ఈ వివరాలు వెల్లడించి జనం మోసగాళ్ల బారినపడకుండా చర్యలు చేపట్టింది. అంతేకాకుండా పాస్‌పోర్ట్ అప్లికేషన్ అధికారిక వెబ్‌సైట్ వివరాలు సైతం వెల్లడించింది. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు passportindia.gov.in లోకి లాగాన్ అయి వివరాలు సబ్మిట్ చేయాల్సిందిగా సూచించింది. ఒకవేళ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని భావించిన వారు mPassport Seva యాప్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చని కేంద్రం స్పష్టంచేసింది. పాస్‌పోర్ట్ అప్లికేషన్ గురించి మీరు తెలుసుకున్న ఈ విలువైన సమాచారాన్ని మీ బంధుమిత్రులతో పంచుకుని వారు కూడా మోసగాళ్ల బారిన పడకుండా కాపాడండి. అందుకోసం మీరు చేయాల్సిందల్లా వాట్సాప్ ద్వారా ఈ వార్తా కథనం లింకుని వారికి షేర్ చేయడమే. ఇలాంటి విలువైన సమాచారం, ఆర్థికపరమైన అంశాల కోసం కీప్ రీడింగ్ జీ తెలుగు న్యూస్.

ఇది కూడా చదవండి : Tata Tiago Car: జనం కళ్లు మూసుకుని కొంటున్న చీప్ అండ్ బెస్ట్ టాటా కారు ఇదే

ఇది కూడా చదవండి : Aadhaar Card Update News: ఆధార్ కార్డుదారులకు ముఖ్యమైన గమనిక

ఇది కూడా చదవండి : Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డుపై ఫోటో మార్చుకోవడం ఎలా ?

ఇది కూడా చదవండి : PM Svanidhi Yojana: ఈ లోన్ తీసుకుంటే నయాపైస వడ్డీ లేదు.. గ్యారెంటీ అసలే లేదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News