Credit Card: ఎస్బీఐ బంపర్ ఆఫర్, ఉచిత క్రెడిట్ కార్డుతో పాటు సోనీలివ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఫ్రీ

Credit Card: క్రెడిట్ కార్డు వినియోగదారులకు గుడ్‌న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఉచితంగా క్రెడిట్ కార్డు అందిస్తోంది. ఉచితంగా క్రెడిట్ కార్డు జారీతో పాటు అదిరిపోయే ఆఫర్లు కూడా అందిస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 29, 2023, 06:27 AM IST
Credit Card: ఎస్బీఐ బంపర్ ఆఫర్, ఉచిత క్రెడిట్ కార్డుతో పాటు సోనీలివ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఫ్రీ

Credit Card: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ ఎస్బీఐ ప్రైవేట్ బ్యాంకులతో సమానంగా క్రెడిట్ కార్డు, ఇతర రుణ సౌకర్యాల్ని అందిస్తోంది. ఇప్పుడు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది ఎస్బీఐ. క్రెడిట్ కార్డుతో పాటు సోనీలివ్ సబ్‌స్క్రిప్షన్ ఏడాదిపాటు ఉచితంగా ఇవ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

దేశంలో ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. బ్యాంకులు కూడా పోటీ పడి క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉచితంగా క్రెడిట్ కార్డుల ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం క్రెడిట్ కార్డు వార్షిక ఫీజు లేకుండా ఉచితంగా అందుతుంది. ఈ క్రెడిట్ కార్డుతో పాటు 999 రూపాయల అదనపు ప్రయోజనం కలగనుంది. ఒక్క రూపాయి లేకుండానే 999 రూపాయల విలువైన సోనీ లివ్ ఓటీటీ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది. దీంతోపాటు యాడ్ ఆన్ క్రెడిట్ కార్డులు కూడా పొందవచ్చు.

ఎస్బీఐ ప్రకటించిన ఈ క్రెడిట్ కార్డు  పేరు యాడ్ ఆన్ క్రెడిట్ కార్డు. యాడ్ ఆన్ క్రెడిట్ కార్టు తీసుకుంటేనే 999 రూపాయల సోనీ లివ్ ఉచిత సభ్యత్వం లభిస్తుంది. ఈ క్రెడిట్ కార్డు ప్రయోజనాలను ఇంట్లో కుటుంబసభ్యులు కూడా పొందవచ్చు. యాడ్ ఆన్ క్రెడిట్ కార్డు తీసుకున్నవారు మొదటి రెండు నెలల్లో అంటే 60 రోజుల్లో కనీసం 1000 రూపాయలైనా ఒకేసారి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ ఆఫర్ పరిమితకాలానికే ఉంటుందని ఎస్బీఐ తెలిపింది. మే 22 నుంచి జూలై 22 వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 

ఎస్బీఐ యాడ్ ఆన్ కార్డు ప్రకారం ఒకే కార్డుపై మూడు యాడ్ ఆన్ కార్డులు తీసుకోవచ్చు. 18 ఏళ్లు నిండినవారికి ఇది వర్తిస్తుంది. యాడ్ ఆన్ కార్డులకు ఏ విధమైన అదనపు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. 

Also read: Post Office Schemes: ఈ పోస్టాఫీసు స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి.. మీ డబ్బును రెట్టింపు చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News