sahara groupకష్టాల్లో సహారా గ్రూప్... సుప్రీంకోర్టులో చేధు అనుభవం

Written by - Deepak | Edited by - ZH Telugu Desk | Last Updated : May 27, 2022, 04:44 PM IST
  • హారా గ్రూప్ చీఫ్‌ సుబ్రతా రాయ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
  • పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్‌లను వేగంగా పరిష్కరించాలని ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది
  • కాలయాపన అయిన నేపథ్యంలో త్వరగా కేసును విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది
 sahara groupకష్టాల్లో సహారా గ్రూప్... సుప్రీంకోర్టులో చేధు అనుభవం

sahara group సహారా గ్రూప్ చీఫ్‌ సుబ్రతా రాయ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సహారా గ్రూపునకు చెందిన 9 సంస్థలపై ఎస్‌ఎఫ్‌ఐఓ విచారణను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో పాటుగా సహారా గ్రూప్‌ చీఫ్‌ సుబ్రతా రాయ్ తో పాటు ఆయన సంస్థలకు చెందిన ఉన్నతోద్యోగులపై లుక్‌అవుట్‌ సర్క్యులర్‌లతో  పాటు ఇతర చర్యలు తీసుకునేందుకు కూడా సుప్రీం కోర్టు వీలు కల్పించింది. సుబ్రతోరాయ్‌కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తోపాటు ఎం.త్రివేదిలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది. 

క్యూ గోల్డ్‌ మార్ట్‌ లిమిటెడ్, సహారా క్యూషాప్‌ యూనిక్‌ ప్రొడక్ట్స్‌ రేంజ్‌ లిమిటెడ్, సహారా హౌసింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వ్యవహారాలపై కేంద్రం 2018లోనే విచారణకు అదేశించింది. సంస్థ అక్రమాలకు పాల్పడిందని ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో సమగ్ర విచారణ జరపాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మూడు కంపెనీలతో పాటు సుబ్రతో రాయ్‌కు చెందిన... క్వింగ్‌ అంబి సిటీ డెవలపర్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, ఆంబీ వ్యాలీ లిమిటెడ్, సహారా ప్రైమ్‌ సిటీ లిమిటెడ్, సహారా ఇండియా కమర్షియల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్,  సహారా ఇండియా రియల్‌ ఎస్టేట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, హారా ఇండియా ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ పై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ సంస్థలపై విచారణ జరపాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. 

అయితే దర్యాప్తు సంస్థలు విచారణ జరిపి తన నివేదికలను కేంద్రానికి అప్పగించాయి. అయితే ఈ తరుణంలో సహారా గ్రూప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తమ కేసులో ఉన్న మెరిట్స్ ఆధారంగా తమకు ఉపశమమనం కల్పించాలని కోరాయి. ఢిల్లీ హైకోర్టు సహారా వాదనలతో ఏకీభవించి పలు రిలీఫ్‌లు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం....పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్‌లను వేగంగా  పరిష్కరించాలని ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. ఈపాటికే  చాలా కాలయాపన అయిన నేపథ్యంలో త్వరగా కేసును విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G Gautam Adani $100 బిలియన్లు నష్టపోయినా ఇంకా అపర కుబేరుడిగా కొనసాగుతున్న అదానీ

Apple Link - https://apple.co/3loQYe MARA RAJA BATTERIES,అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించేందుకు సిద్ధం అవుతున్న అమర్‌ రాజా బ్యాటరీస్

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook 

Trending News