Tata New SUV: మహీంద్రా థార్, జీప్‌కు పోటీగా టాటా నుంచి కొత్త ఎస్‌యూవీ, ఎలా ఉంటుందంటే

Tata New SUV: దేశంలోని ప్రమఖ కారు తయారీ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త ఎస్‌యూవీ లాంచ్ చేసే ఆలోచనలో ఉంది. పవర్ ఫుల్ ఇంజన్, అద్బుతమైన ఫీచర్లతో Tata 4X4 SUV ప్రవేశపెట్టేందుకు సిద్ధమౌతోంది. ఈ ఎస్‌యూవీ ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 8, 2024, 12:12 PM IST
Tata New SUV: మహీంద్రా థార్, జీప్‌కు పోటీగా టాటా నుంచి కొత్త ఎస్‌యూవీ, ఎలా ఉంటుందంటే

Tata New SUV: దేశంలోని ఎస్‌యూవీ మార్కెట్‌లో టాటా మోటార్స్ సంచలనం రేపేందుకు సిద్ధమౌతోంది. ఇటీవలే మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చిన మహీంద్రా థార్, జీప్ ఎస్‌యూవీలకు పోటీగా అత్యంత శక్తివంతమైన SUV లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఎస్‌యూవీ రంగంలో బలంగా ఉన్న టాటా మోటార్స్ మార్కెట్ వాటా మరింతగా పెంచుకునేందుకు ప్రణాళిక రచిస్తోంది. 

ఎస్‌యూవీ మార్కెట్‌లో ఇప్పటికే టాటా మోటార్స్ కంపెనీకు చెందగిన హ్యారియర్ ఈవీ, సియారా వాహనాలు బలంగా ఉన్నాయి. మార్కెట్‌లో ఈ వాహనాలకు మంచి క్రేజ్ ఉంది. ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ విభాగంలో టాటా హ్యారియర్, టాటా సియారాలు ఇప్పటికే పాతుకుపోయాయి. ఇప్పుడు మహీంద్రా థార్, జీప్ వాహనాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సరికొత్త ఎస్‌యూవీ లాంచ్‌కు సిద్దమైంది. టాటా మోటార్స్‌కు చెందిన Sierraను కొత్త ఫీచర్లు, పవర్ ఫుల్ ఇంజన్‌తో ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లాంచ్‌కు సిద్ధమైంది. ఈ ఎస్‌యూవీని బెస్ట్ ఆప్ రోడింగ్ సామర్ధ్యం కలిగిన వాహనంగా తీర్చిదిద్దనున్నారు. మహీంద్రా థార్‌తో పోటీ ఇవ్వాలంటే ఆ మాత్రం ఉండాల్సిందే. 

ఆఫ్ రోడ్ 4 వీల్ డ్రైవ్‌తో ఎస్‌యూవీ విభాగంలో మరింతగా బలోపేతమయ్యేందుకు టాటా మోటార్స్ ప్రయత్నిస్తోంది. దీనికోసం Harrier EV, Sierra కార్లను సరికొత్తగా ఆధునీకరించి రీలాంచ్ చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో మహీంద్రా థార్, జీప్ వాటాను కొల్లగొట్టాలంటే ఇంజన్ మరింత పవర్ ఫుల్‌గా ఉండాలి. ఫీచర్లు అద్భుతంగా ఉండాలి. ఇటీవల జరిగిన 78వ టాటా మోటార్స్ వార్షిక సమావేశంలో ఇదే విషయాన్ని కంపెనీ స్పష్టం చేసింది. జీప్, మహీంద్రా థార్ వంటి కారును మార్కెట్‌లో దించనున్నామని తెలిపింది. 

అందుకే టాటా సియారాను కొత్త మోడర్న్ లుక్ ఇచ్చి మరోసారి లాంచ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. టాటా సియారాను ఊహించని విధంగా ఆఫ్ రోడింగ్ సామర్ధ్యం ఉండేట్టు తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉంది. ఎప్పుడు లాంచ్ చేయవచ్చనేది స్పష్టత లేదు. 

Also read: Haryana JK Results 2024: జమ్ము కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఆధిక్యం, హర్యానాలో హోరాహోరీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News