Gold Price slightly decreased today 6th june 2022: దేశంలో బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో గోల్డ్ నిల్వ, వడ్డీ రేట్లు, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు లాంటి కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే బంగారానికి మహిళలు అధిక ప్రాధాన్యతనిస్తారు కాబట్టి.. ధరలు పెరిగినా వ్యాపారాలు మాత్రం జోరుగానే కొనసాగుతుంటాయి. తాజాగా పెరుగుతున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది.
దేశంలో 3-4 రోజుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు ఈ రోజు కాస్త బ్రేక్ పడింది. సోమవారం (జూన్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.47,740లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 10.. 24 క్యారెట్ల ధరపై కూడా రూ. 10 తగ్గింది. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 61,700గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ఎలాంటి మార్పు లేదు.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,740 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,090గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 47,740 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,090గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,740గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,090 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,740.. 24 క్యారెట్ల ధర రూ. 52,090గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 47,740 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,090గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,740 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,090గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 47,740.. 24 క్యారెట్ల ధర రూ. 52,090గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,740 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,090 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ.67,600లుగా ఉంది.
Also Read: Horoscope Today June 6 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ప్రాణహాని ఉంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook