Gold Rate Today In India: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. వెండి యథాతథం

Gold Rate Today In India On 30th October 2020 |  బంగారం ధరలు (Gold Rate Today) వరుసగా రెండోరోజూ స్వల్పంగా తగ్గాయి. పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా, వెండి ధరలు మాత్రం యథాతథంగా కొసాగుతున్నాయి. తాజాగా వెండి ధర ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.62,400గా కొనసాగుతోంది.

Last Updated : Oct 30, 2020, 07:19 AM IST
  • బులియన్ మార్కెట్‌లో తాజా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
  • ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి
  • వెండి ధర యథాతథం. తాజాగా 1 కేజీ ధర రూ.62,400గా మార్కెట్
Gold Rate Today In India: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. వెండి యథాతథం

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా తగ్గాయి. పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా, వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో తాజాగా బంగారం ధర రూ.340 మేర స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,720కి పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.320 తగ్గడంతో ధర రూ.47,410 అయింది.

 

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) వరుసగా రెండోరోజూ దిగొచ్చాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.440 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.52,560కి దిగొచ్చింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.400 మేర తగ్గి 10 గ్రాముల ధర రూ.49,100 వద్ద ట్రేడ్ అవుతోంది.

 

గత వారం రోజులుగా బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన వెండి ధరలు (Silver Rate in India) యథాతథంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో తాజాగా వెండి ధరలో ఏ మార్పులేదు. ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.62,400గా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా వెండి ఒకే ధరలో మార్కెట్ అవుతోంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News