Gold Rate Today in India: తగ్గిన బంగారం ధరలు.. పుంజుకున్న వెండి ధరలు

Today 24 Carat Gold Rate Per Gram in Hyderabad | మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు దిగిరాగా, ఢిల్లీలో మాత్రం ధర పెరిగింది. మరోవైపు నిన్న భారీగా పెరిగిన వెండి ధరలు నేడు స్వల్పంగా పుంజుకున్నాయి.

Last Updated : Nov 4, 2020, 07:52 AM IST
Gold Rate Today in India: తగ్గిన బంగారం ధరలు.. పుంజుకున్న వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు దిగిరాగా, ఢిల్లీలో మాత్రం ధర పెరిగింది. మరోవైపు నిన్న భారీగా పెరిగిన వెండి ధరలు నేడు స్వల్పంగా పుంజుకున్నాయి. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.370 మేర దిగొచ్చింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,550కి క్షీణించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,250కి దిగొచ్చింది.

 

ఢిల్లీ మార్కెట్‌లో ఇటీవల వరుసగా దిగొచ్చిన బంగారం ధరలు (Gold Rate in Delhi) తాజాగా పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.110 మేర పెరగడంతో  10 గ్రాముల ధర రూ.52,780కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,300కి ఎగసింది.

 

బులియన్ మార్కెట్‌లో నిన్న భారీగా పెరిగిన వెండి ధరలు (Silver Rate in India) నేడు స్వల్పంగా పెరిగాయి. తాజాగా బులియన్ మార్కెట్‌లో వెండి ధర రూ.200 మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.61,900కు చేరుకుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News