ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ స్పిన్ అప్ సబ్‌స్క్రిప్షన్ ప్రవేశపెట్టింది. అంటే యూజర్లు తమ ఫాలోవర్లకు ప్రత్యేకమైన కంటెంట్‌కు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇటీవల గత కొద్దికాలంగా చర్చల్లో ఉన్న ట్విట్టర్ మరోసారి చర్చనీయాంశమైంది.
ఇప్పటి వరకూ ట్విట్టర్‌లో పలు నిబంధనలు మార్చుతూ వచ్చిన ట్విట్టర్..యూజర్లకు డబ్బులు సంపాదించే అవకాశాన్ని కల్పించింది. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్..స్పిన్ అప్ సబ్‌స్క్రిప్షన్ చేస్తుందని ఎలాన్ మస్క్ తెలిపారు. అంటే ఈ సౌకర్యం ద్వారా యూజర్లు ప్రత్యేకమైన కంటెంట్ కోసం ఫాలోవర్ల నుంచి ఛార్జ్ చేయవచ్చు.
ఒక యూజర్ కొత్త బ్లూ ఫీచర్‌తో పాటు పెద్ద ట్వీట్ పోస్ట్ చేయాలంటే గరిష్టంగా 4000 క్యారెక్టర్లు పోస్ట్ చేసుకునే అవకాశముంటుంది. పెద్ద ట్వీట్లతో మంచి ఉపయోగముంటుందని ఎలాన్ మస్క్ తెలిపారు. ట్విట్టర్‌పై ఎలాంటి కంటెంట్ అయినా పోస్ట్ చేయవచ్చు. ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ పెంచనుంది. అందుకే కంటెంట్ కోసం యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేసుకోవచ్చు. ఈ కొత్త విధానంగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
త్వరలో రానున్న ఈ కొత్త ఫీచర్ సహాయంతో యూజర్లు ట్విట్టర్‌పై తమ ఫాలోవర్ల నుంచి డబ్బులు సంపాదించేందుకు అవకాశముంటుంది. గతవారం మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ చేసిన ప్రకటన ప్రకారం..నాన్ ట్విట్టర్ బ్లూ యూజర్లకు మార్చ్ 20 తరువాత టూ ఫ్యాక్టర్ ఆథెంటిఫికేషన్ రూపంలో టెక్స్ట్ మెస్సేజ్ ఉపయోగించుకునే అనుమతి ఇవ్వదు. వెరిఫికేషన్‌తో పాటు తమ బ్లూ సేవలకు ప్రతి నెలా 650 రూపాయలు, ఇండియాలో ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోన్లపై 900 రూపాయలు ఛార్జ్ చేయవచ్చు. దీంతోపాటు బ్లూ సబ్‌స్క్రైబర్ 4000 అక్షరాల వరకూ పెద్ద ట్విట్లు చేయవచ్చు. బ్లూ యూజర్లకు తమ హోల్ టైమ్‌లైన్‌లో 50 శాతం తక్కువ ప్రకటనలు కన్పిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook