Union Budget 2023: మోడీ ప్రభుత్వం 2.0కి సంబంధించిన చివరి బడ్జెట్ కావడంతో చాలా రకాల మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌ల విషయానికొస్తే మార్కెట్ స్పందన ఎలా ఉండబోతోందో కొద్ది గంటల్లోనే తేలిపోనుంది. అయితే గత ఏడాది ఫిబ్రవరి 1న స్టాక్ మార్కెట్ కుదేలైన విషయం తెలిసిందే. అంతేకాకుండా గత సంవత్సరం బడ్జెట్ ప్రవేశ పెట్టిన 6 రోజుల తర్వాత స్టాక్ మార్కెట్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఒక్కసారిగా సెన్సెక్స్ క్షీణించి పెట్టుబడిదారులు భారీ నిరాశ ఏర్పడింది. అయితే స్టాక్ మార్కెట్ ఈ సంవత్సరం బడ్జెట్ తర్వాత ఎలా ఉండబోతోందో చూడాల్సిందే.
2021 ఫిబ్రవరి 1 సంవత్సరం బడ్జెట్ విషయానికొస్తే.. బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్ పుంజుకుంది. ఆ రోజు సెన్సెక్స్ 46617 వద్ద ప్రారంభమై, గరిష్టంగా 48764కి చేరుకుంది. తర్వాత 1982 పాయింట్ల జంప్‌తో 48600 స్థాయి వద్ద ముగిసింది. అయితే 2020 సంవత్సరంలో ఫిబ్రవరి 1న సెన్సెక్స్ 1017 పాయింట్ల పతనంతో ముగిసింది. అయితే ఈ సంవత్సరం బడ్జెట్ ఆశ జనకంగా ఉండబోతోంది కాబట్టి ఈ సారి సెన్సెక్స్ 450 ప్లస్ ప్రారంభమైంది.
2020లో బడ్జెట్ రోజున సెన్సెక్స్ 40753 స్థాయి వద్ద ట్రేడింగ్ ప్రారంభించి.. 40905 స్థాయికి చేరుకుంది. ఇదిలా ఉండగా రోజు కనిష్ట స్థాయి కూడా 39631కి చేరుకుంది. తర్వాత సెన్సెక్స్ 1017 పాయింట్ల డైవ్ తీసుకొని.. 39735 స్థాయి వద్ద ముగిసింది. 2019 బడ్జెట్ రోజున సెన్సెక్స్ 157 పాయింట్ల లాభంతో ముగిసింది. 36311 వద్ద ప్రారంభమై.. 36469 వద్ద ట్రేడ్ అయ్యింది. 2018లో మోడీ ప్రభుత్వ రెండవ సారి ఏర్పడి ప్రవేశపెట్టిన బడ్జెట్ రోజున సెన్సెక్స్ 142 పాయింట్లు పడిపోయి 35,906 వద్ద ముగిసింది.
2017 ఫిబ్రవరి 1 లో సెన్సెక్స్ 27669 స్థాయి వద్ద ప్రారంభమైంది. బడ్జెట్ ఆ రోజు కనిష్ట స్థాయి 27590కి వచ్చిన తర్వాత, సెన్సెక్స్ కోలుకుని చివరకు 472 పాయింట్ల జంప్‌తో 28141 స్థాయి వద్ద ముగింసింది. అయితే 2016లో బడ్జెట్ రోజున సెన్సెక్స్ 157 పాయింట్లు పడిపోయి.. 24824 వద్ద ముగిసింది. ఈ రోజు ఎలా ఉండబోతోందో బడ్జెట్ తర్వాత తెలిసే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook