Budget 2022: బడ్జెట్ 2022 సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని రంగాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. కొవిడ్ వరుసగా రెండో ఏటా.. కొవిడ్ పరిస్థితుల నడుమ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది (Budget 2022-23 updates) కేంద్రం. మరి ఈ సారి పద్దు నుంచి ఐటీ రంగం ఏం కోరుకుంటోంది?
అంచనాలు ఇలా..
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. దీని కారణంగా అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయినప్పటికీ.. కొవిడ్ పరిస్థితులను ఎదుర్కొని మరీ ముందుకు దూసుకుపోతున్న రంగం ఏదైనా ఉందంటే అది ఐటీ రంగమే.
ఈ పరిస్థితుల నేపథ్యంలో రిస్క్ క్యాపిటల్‌కు ఉపశమనం కలిగించేందుకు గాను కేంద్రం పన్ను మినహాయింపు ఇస్తుందని (IT sector expectations on Budget 2022) భావిస్తోంది.
ఐటీ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు అంకుర సంస్థలపై దృష్టిసారించాలని ప్రభుత్వానికి నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీ, ప్రోత్సాహకాలను ఇస్తుందని కూడా (Startups on Budget 2022) ఆశిస్తున్నారు.
ఐటీ రంగంలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుు పన్ను రాయితీలను ప్రకటించాలని కోరుతోంది ఐటీ రంగం.
ఈ సారి బడ్జెట్ సమావేశాలు ఇలా..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం (Budget Session of Parliament ) కానున్నాయి. ఏప్రిల్ 8 వరకు పార్లమెంట్ ఉభయ సభలు పని (Parliament Budget Session dates) చేయనున్నాయి. రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.
ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను (Union Budget 2022) ప్రవేశపెట్టనున్నారు.
కరోనా నేపథ్యంలో బడ్జెట్ రోజు మినహా.. మిగతా అన్ని రోజులు ఉభయ సభలు షిఫ్టుల వారీగా పని చేయనున్నాయి. పార్లమెంట్ సిబ్బందిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌గా తేలడం (Corona in Parliament) ఇందుకు కారణం.
Also read: Budget 2022: కేంద్రం ఆ ప్రకటన చేస్తే- పీపీఎఫ్ ద్వారా రూ.80 లక్షల ఆదాయం!
Also read: Gold Price Today: పెరిగిన బంగారం ధరలు, దేశంలోని ప్రధాన నగరాల్లోని ఇవాళ్టి పసిడి ధరలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Budget 2022: బడ్జెట్ 2022-23పై ఐటీ రంగం అంచనాలు, ఆశలు ఇవే..!
బడ్జెట్ 2022-23పై ఐటీ రంగం భారీ ఆశలు
ప్రోత్సాహకాలు అవసరమంటున్న నిపుణులు
వచ్చే నెల 1న పార్లమెంట్ ముందుకు పద్దు