Health Insurance: ఆరోగ్య భీమా ఎంత అవసరమనేది అందరికీ తెలిసిందే. కరోనా మహమ్మారి సమయంలో ఇంకా బాగా అర్ధమైంది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్య భీమా..ఆగకుండా, రీ స్టోర్ అవాలంటే తీసుకోవల్సిన జాగ్రత్తలేంటి..
మనిషి ఎప్పుడు ఎంత సురక్షితంగా ఉంటాడో ఎవరికీ తెలియదు. యాక్సిడెంట్ కావచ్చు లేదా హార్ట్ ఎటాక్ కావచ్చు మరే ఇతర ప్రాణాంతక వ్యాధి కావచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనప్పుుడు వైద్యం కోసం డబ్బులు సిద్ధంగా ఉంచుకోవడం తప్పదు. ఇది అందరికీ సాధ్యం కాని పని. అటువంటప్పుడు ఉపయోగపడేదే హెల్త్ ఇన్సూరెన్స్. మారుతున్న వైద్య అవసరాలకు తగ్గట్టుగా పాలసీలు కూడా ఉంటున్నాయి.
ఈ తరుణంలో ఆరోగ్య భీమా తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఎందుకంటే ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి..హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం క్లెయిమ్ పూర్తిగా వాడుకున్న తరువాత మరోసారి అనారోగ్యం చేస్తే, ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి..ఈ పరిస్థితుల్నించి గట్టెక్కించేందుకే హెల్త్ ఇన్సూరెన్స్ రీస్టోరేషన్ లేదా రీఫిల్ సదుపాయం. అంటే నిర్ణీత వ్యవధిలో పాలసీ ఖర్చయినా..తిరిగి అదే విలువకు చేరుకుంటుంది. దీన్నీ పాలసీ రీ స్టోరేషన్ లేదా రీఫిల్ అంటారు.
మార్కెట్‌లో అన్ని సంస్థల పాలసీలకు రీ స్టోరేషన్ లేదా రీఫిల్ ఉండదు. ఏ కంపెనీ పాలసీలో ఉందో చూసి తీసుకోవడం మంచిది. పాలసీదారుడు 5 లక్షల పాలసీ తీసుకుంటే..మొత్తం ఖర్చయిన తరువాత రీస్టోర్ అవుతుంది. ఒక్కోసారి అందులో 3-4 లక్షలే ఖర్చయితే మిగిలింది వెంటనే రీస్టోర్ కాదు. అయితే ఇప్పుడు కొన్ని కంపెనీలు ఆ ప్రత్యేక సందర్భాల్లో కూడా రీస్టోర్ అయ్యే అవకాశం కల్పిస్తున్నారు. అందుకే పాలసీ తీసుకునేటప్పుడు అన్ని వివరాలు పరిశీలించి తీసుకోవాలి.
రీస్టోరేషన్ వెసులుబాటు ఉన్న పాలసీల్లో ప్రీమియం కాస్త ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగతంగా కాకుండా మొత్తం కుటుంబానికి ఆరోగ్య భీమా తీసుకున్నప్పుడు అంటే ఫ్లోటర్ ఫ్యామిలీ పాలసీ తీసుకున్నప్పుడు రీస్టోరేషన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్యంతో పాలసీ ఖర్చయినప్పుడు..మరో వ్యక్తికి ఏమైనా జరిగినా..పాలసీ రీస్టోరేషన్ ఉపయోగపడుతుంది.
Also read: Post Office Saving Plans: నెలకు పదివేల పెట్టుబడితో..పదేళ్ల తరువాత 16 లక్షల రూపాయలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.