Sewing Machine: పిల్లలను జాగ్రత్తగా చూసుకోకుంటే అనుకోని సంఘటనలు చోటుచేసుకుని తీవ్ర విషాదం చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. పిల్లల పోషణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే వారి ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది. ఏమరుపాటుగా ఉండడంతో ఘోర సంఘటన జరిగింది. చిన్నారి ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్లి కుట్టు మిషన్ వద్దకు వెళ్లింది. ఆ సమయంలో మిషన్ వద్ద ఉన్న విద్యుత్ తీగను పట్టుకుని నోట్లె పెట్టుకున్నాడు. దీంతో విద్యుదాఘాతానికి గురై చిన్నారి కన్నుమూశాడు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Also Read: Australia: ట్రెక్కింగ్ చేస్తూ కాలుజారి లోయలో పడి ఏపీ వైద్యురాలు మృతి.. ఆస్ట్రేలియాలో ఘటన
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం తూటికుంట్ల గ్రామానికి చెందిన రెండేళ్ల రమేశ్ కుట్టు మిషన్ వద్దకు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యి మరణించాడు. ఈ సంఘటన మహాశివరాత్రి రోజే సంభవించింది. పండుగ పూట ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. జీవనాధారం కోసం తెచ్చుకున్న కుట్టు మిషన్ చిన్నారిని బలి తీసుకుందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన విద్యుత్ తీగను చూశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Also Read: Mandapam Collapse: శివ శివా.. మహాశివరాత్రి వేడుకల్లో అపశ్రుతి.. శ్రీశైలంలో కూలిన మండపం
ఈ సంఘటన పిల్లల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతోంది. చిన్నపిల్లలు కలిగిన వాళ్లు ఈ సంఘటనతో మేల్కోవాలని పోలీసులు సూచిస్తున్నారు. చిన్నారులను ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. విద్యుత్ ఉపకరణాలకు దూరంగా చిన్నారులను ఉంచాలని, ఆడుకునే సమయంలో ఓ కన్నేసి ఉంచాలని పేర్కొంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter