Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్.. క్యూ న్యూస్ ఆఫీస్ వద్ద హై టెన్షన్ !!

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్ పై క్యూ న్యూస్ సంస్థ సిబ్బంది, తీన్మార్ మల్లన్న మద్దతుదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏ కేసులో, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండానే, కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వకుండానే తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారని క్యూ న్యూస్ సిబ్బంది ఆరోపిస్తున్నారు.

Written by - Pavan | Last Updated : Mar 21, 2023, 10:35 PM IST
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్.. క్యూ న్యూస్ ఆఫీస్ వద్ద హై టెన్షన్ !!

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు ఇన్నోవా వాహనాలు, ఒక బస్సులో క్యూ న్యూస్ ఆఫీస్ వద్దకు చేరుకున్న పోలీసులు తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన అనంతరం QNews సిబ్బందిని బయటికి పంపించిన పోలీసులు.. ఆఫీసులో సోదాలు చేస్తున్నారు. తీన్మాన్ మల్లన్నను అరెస్ట్ చేసిన సమయంలోనే తీన్మార్ మల్లన్న సహచరుడు, క్యూన్యూస్ సంస్థలో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న సుదర్శన్‌ని కూడా పోలీసులు నల్గొండలో అదుపులోకి తీసుకున్నారు.
 
తీన్మార్ మల్లన్న అరెస్ట్ పై క్యూ న్యూస్ సంస్థ సిబ్బంది, తీన్మార్ మల్లన్న మద్దతుదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏ కేసులో, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండానే, కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వకుండానే తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారని క్యూ న్యూస్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. తీన్మార్ మల్లన్న అరెస్టుపై క్యూ న్యూస్ లీగల్ టీమ్ ఆరాతీసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

ఇదిలావుంటే, తీన్మార్ మల్లన్న అరెస్ట్ విషయంలో తొలుత అనేక సందేహాలు వినిపించాయి. తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయడానికి వచ్చిన వారు అసలు పోలీసులేనా లేక తీన్మార్ మల్లన్న వైఖరిని వ్యతిరేకించే వారా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అందుకు తగినట్టుగానే తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన వారు శాంతి భద్రతల విభాగానికి చెందిన పోలీసులా లేక టాస్క్‌ఫోర్స్ విభాగానికి చెందిన పోలీసులా అనే విషయంలో క్లారిటీ కొరవడింది. ఒకవేళ అరెస్ట్ చేసినట్టయితే.. అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకువెళ్లారు అనే విషయంలోనూ అయోమయం నెలకొని ఉంది.

తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయడం ఇదేం తొలిసారి కాదు. గతేడాది సైతం తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు.. 73 రోజుల అనంతరం నవంబర్ 8న విడుదల చేశారు. ఆ సమయంలో తీన్మార్ మల్లన్న రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 38 కేసుల్లో విచారణ ఎదుర్కొన్నారు. అందులో 6 కేసులను హై కోర్టు డిస్మిస్ చేయగా.. మిగిలిన 32 కేసుల్లో తీన్మార్ మల్లన్నకు బెయిల్ రావడానికి 73 రోజుల సమయం పట్టింది. తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కాగా.. గతంలో ఓ టీవీ ఛానెల్ కోసం తాను చేసిన షోలో తన స్క్రీన్ నేమ్‌నే తన పేరుగా కొనసాగిస్తూ పబ్లిక్‌లో ముందుకు వెళ్తున్నారు.

ఇది కూడా చదవండి : MLC Kavitha ED Enquiry: ఊపిరిపీల్చుకున్న బీఆర్ఎస్ వర్గాలు.. ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ

ఇది కూడా చదవండి : MLC Kavitha Delhi Liquor Scam: ఇది మహిళలు చేసే వ్యాపారామా..? నీకు ఇదే దొరికిందా..? ఎమ్మెల్సీ కవితపై ఈటల ఫైర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

BRS MLC KavithaDelhi liquor scam caseBandi SanjaybrsBJP

Trending News