Anasya Bharadwaj in Twitter Controversy: మరో వివాదంలో అనసూయ.. ఈసారి ఏకంగా కేటీఆర్ ట్వీట్ తో!

Anasya Bharadwaj Landed in Controversy by tweeting KTR Tweet: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనసూయ కేటీఆర్ ట్వీట్ ను రీ ట్వీట్ చేయడం ద్వారా వివాదంలో చిక్కుకున్నారు. ఆ వివరాలు

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2022, 07:41 PM IST
Anasya Bharadwaj in Twitter Controversy: మరో వివాదంలో అనసూయ.. ఈసారి ఏకంగా కేటీఆర్ ట్వీట్ తో!

Anasya Bharadwaj Landed in Controversy by tweeting KTR Tweet: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే యాంకర్ కం నటి అనసూయ మరోసారి ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఈ మధ్యనే జబర్దస్త్ కామెడీ షోకి గుడ్ బై చెప్పిన ఆమె మరిన్ని షోలకు యాంకరింగ్ చేస్తున్నారు. అలాగే పూర్తి స్థాయిలో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఆమె చెబుతున్నారు. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనసూయ ఒక ట్వీట్ చేయగా అది ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపింది. '

అసలు విషయం ఏమిటంటే ఇటీవల మంత్రి కేటీఆర్ గుజరాత్ బిల్కిన్ బానో సామూహిక అత్యాచారం కేసులో జైలుకు వెళ్లిన దోషులు విడుదలయ్యాక వారికి ఒక సంస్థ సన్మానం చేయడంతో వారికి కౌంటర్ ఇస్తూ ఒక ట్వీట్ చేశారు. దాన్ని అనసూయ రీట్వీట్ చేయడంతో పలువురు నెటిజెన్లు అనసూయను టార్గెట్ చేశారు. మరి అప్పట్లో హైదరాబాదులో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిన సమయంలో మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు.

అయితే ఈ విషయం మీద అనసూయ స్పందిస్తూ నేను చేసిన ట్వీట్లను దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు, నేను ఎలాంటి ట్వీట్ చేసినా అది నా సొంత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే తప్ప ఎవరినీ, దేనినీ ప్రమోట్ చేయడానికి కాదని ఆమె రిప్లై ఇచ్చింది. అయితే మీరు అలా అనుకున్నప్పుడు రాజకీయ విషయాల మీద ట్వీట్స్ చేయడం మానుకోండి మీరు ముందుగా ఆర్టిస్ట్ అని ఒప్పుకోండని సదరు నైటిజన్ ట్వీట్ చేశారు. దానికి ఘాటుగా స్పందించిన అనసూయ నేను ముందు మనిషిని తర్వాత స్త్రీని ఆ తర్వాతే మిగతావన్నీ అంటూ కౌంటర్ ఇచ్చారు.

అలాగే నేరస్తులను విడిపించడాన్నీ వ్యతిరేకిస్తూ చేసిన ట్వీట్ అసలు రాజకీయంగా ఎలా మారింది? ఓ క్షమించండి, మీరు రాజకీయ నాయకులు అనుకుంటా, ఎందుకంటే దేశంలో జరుగుతున్న అఘాయిత్యాలపై ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై రెస్పాండ్ అవ్వడం మీ అభిప్రాయం ప్రకారం రాజకీయ బాధ్యత అనిపిస్తుంది కదా అంటూ ఆమె ఘాటు కౌంటర్ ఇచ్చారు. అంతేగాక దయచేసి నేను చేసిన ట్వీట్లను రాజకీయం చేయవద్దని అనసూయ కోరారు. అయితే కేటీఆర్ చేసిన ట్వీట్ ను ఆమె రీ ట్వీట్  చేయడం ద్వారా కేటీఆర్ అలాగే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారనే ఉద్దేశంతో ఇతర పార్టీలకు చెందిన నెటిజన్లు ఆమెకు కౌంటర్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. 

Also Read: Rajendra Prasad Passed Away: టాలీవుడ్లో విషాదం.. డైరెక్టర్ ఆకస్మిక మృతి! 

Also Read: Anasuya Bharadwaj Pics: శారీలో అనసూయ భరద్వాజ్.. అందానికే అసూయ పుట్టే సొగసులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News