Annapurna Photo Studio Trailer Review: పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ చిత్ర నిర్మాణ సంస్థ ఈసారి అన్నపూర్ణ ఫోటో స్టూడియో అనే మరో ఆసక్తికరమైన కథ, కథనంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. చందు ముద్దు దర్శకత్వం వహించిన అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమాలో చైతన్య రావు, లావణ్య సాహుకార జంటగా నటించారు. ఈ నెల 21 న అన్నపూర్ణ ఫోటో స్టూడియో మూవీ విడుదల కానుండగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అయింది. బిగ్ బెన్ సినిమాస్ నిర్మించిన పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్ చిత్రాల హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా అన్నపూర్ణ ఫోటో స్టూడియో ట్రైలర్ లాంచ్ అయింది.
అన్నపూర్ణ ఫోటో స్టూడియో మూవీని 90వ దశకం నేపథ్యంలో తెరకెక్కించారు. ఒక ప్రేమికుడు తన ప్రేయసి కోసం పడే పాట్లు, సవాళ్లనే ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రం కథాంశం రూపుదిద్దుకుంది. నేటితరం ఆడియెన్స్ కోరుకునే అన్ని ఆసక్తికరమైన అంశాలు అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమాలో ఉంటాయని మూవీ యూనిట్ వెల్లడించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK