Chiranjeevi: ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు పండగే. 1955 ఆగష్టు 22న శివశంకర వరప్రసాద్ గా కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించిన చిరంజీవి.. 1978 సెప్టెంబర్ 22న చిరంజీవి పేరుతో వెండితెరకు ‘ప్రాణం ఖరీదు’సినిమా ద్వారా పరిచయం అయ్యారు. ఈ పేరు మహిమో ఏమో.. చిరంజీవి ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. హీరోగా దాదాపు 46 యేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నేళ్లు కెరీర్ లో చిరంజీవి బర్త్ డే రోజున విడుదలైన ఏకైక చిత్రం మాత్రం ఒకటి మాత్రమే ఉంది. అది జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఏకైక చిత్రం ‘చంటబ్బాయి’.
ఈ సినిమా 1986 ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు కానుకగా విడుదలైంది. జ్యోతి ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై భీమవరపు బుచ్చిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. చక్రవర్తి సంగీతం అందించారు. ఈ సినిమాకు సుహాసిని కథానాయికగా నటించింది. ఈ సినిమా కల్ట్ క్లాసిక్ కామెడీ గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా థియేట్రికల్ గా అంతగా నడవలేదు. కానీ టీవీల్లో మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి చేసిన కామెడీని ఎవరు మరిచిపోలేరు. యాక్షన్ హీరోగా చెలరేగిపోతున్న చిరు కెరీర్ లో ‘చంటబ్బాయి’ సినిమా ఓ అద్భుత కామెడీ చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమా విడుదలైన నెల రోజుల వ్యవధిలోనే ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘రాక్షసుడు’ సినిమా విడుదలైంది.
చంటబ్బాయి సినిమా కంటే ముందు మే 28న విడుదలైన డిజాస్టర్ గా నిలిచింది. మొత్తంగా 1986లో చిరంజీవి నటించిన 8 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో కిరాతకుడు, మగధీరుడు, వేట, చంటబ్బాయి, ధైర్యవంతుడు, చాణక్య శపథం వంటి చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇక అదే యేడాదిలో విడుదలైన ‘కొండవీటి రాజా’, ‘రాక్షసుడు’ చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు నమోదు చేసాయి. ఒక యేడాదిలో కే.రాఘవేంద్రరావు, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన కొండవీటి రాజా, చాణక్య శపథం చిత్రాల్లో కొండవీటి రాజా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అదే యేడాది కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన వేట ఫ్లాప్ గా నిలుస్తే.. రాక్షసుడు బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మరోవైపు ‘చంటబ్బాయి’ సినిమాకు మంచి టాకే వచ్చినా.. అప్పట్లో చిరంజీవి ఇమేజ్ కు భిన్నంగా ఈ సినిమా తెరకెక్కడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేదు. అయితే.. రిపీట్ రన్స్ లో ఈ సినిమా మంచి విజయమే సాధించింది. అటు టీవీల్లో, ఓటీటీల్లో కూడ ‘చంటబ్బాయి’ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏది ఏమైనా చిరంజీవికి ఫ్లాప్ మిగిల్చిన ‘చంటబ్బాయి’ సినిమా మాత్రం ఆయన అభిమానులకు మాత్రం తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter