దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ దసరాకు విడుదలైన సినిమా లియో. ఈ చిత్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కావడంతో మొదటి నుంచి ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రం ట్రైలర్ తరువాత మాత్రం ఈ సినిమాపై కొంచెం అనుమానం ప్రేక్షకుల్లో కలిగింది. అయితే ఆ తరువాత దర్శకుడు ఈ సినిమాలో ఎన్నో సర్ప్రైజ్లు ఉంటాయి అని చెప్పడంతో మళ్లీ నమ్మకంతో సినిమా కోసం వెయిట్ చేసారు.
కాగా సినిమా విడుదలయ్యాక మాత్రం చిత్రం మిక్సర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా దర్శకుడు లోకేష్ మీద కాపీ మరకలు ట్రెండ్ అయ్యాయి. ఏ హిస్టరీ ఆఫ్ వయలెన్స్ సినిమాకు రిఫరెన్స్, కాపీలా సినిమా ఉందని తెలిసిందే. ఇదే విషయాన్ని డైరెక్టర్ సినిమా టైటిల్స్ లో కూడా వేశారు. కాగా ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే అదే కథ పైన మన తెలుగులో ఆల్రెడీ గాయం 2, వారసుడు సినిమాలు వచ్చేసాయి. కాబట్టి తెలుగు ప్రేక్షకులు లియో ఆ రెండు సినిమాలు చూసినట్టే ఉన్నాయి అని సోషల్ మీడియాలో పోస్టులు వేయి సాగారు. అంతేకాదు అసలు ఇది లోకేష్ సినిమాలానే లేదు అని కామెంట్లు పెట్టారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ గురించి సోషల్ మీడియాలో మరో చర్చ కొనసాగుతోంది. ఓవర్సీస్‌లో, ఐమాక్స్ వర్షెన్‌లో తేడా ఉందని జనాలు కామెంట్లు పెడుతున్నారు. అవును మీరు వింటోంది నిజమే ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో తేడా ఉందని అంటున్నారు. ఇంతకీ ఆ తేడా ఏమిటి అంటే పార్తీబన్ లియో అని కేవలం అర్జున్‌కు మాత్రమే తెలుసని, తాము చూసిన సినిమాలో అంతే ఉందని అంటున్నారు కొంతమంది. కానీ చాలామంది చూసిన వర్షం ప్రకారం అర్జున్, సంజయ్ దత్ రెండు పాత్రలకి కూడా పార్తీబనే లియో అని తెలిశాకే ఇద్దరూ చనిపోతారు. కానీ కొంత మందికి మాత్రం కేవలం అర్జున్ పాత్రకే ఆ నిజం తెలుస్తుందని అనుకుంటున్నారు.
కాగా ఈ చర్చ మొదలయ్యాక తెలిసిన అసలు విషయం ఏమిటి అంటే ఈ సినిమాని కొన్ని దగ్గర్ల తక్కువ నిధివీ
వితో వేస్తున్నారట. సినిమాని కొన్ని దగ్గరగా కట్ చేసి వేయడం వల్ల ఇలా క్లైమాక్స్ లో గందరగోళం ఏర్పడింది అని తెలుస్తుంది దీంట్లో ఏదైనా మర్మం ఉందా? లేదా ఎడిటింగ్ లోపమా? అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది..
కానీ ఈ విషయం పైన కూడా చాలామంది దర్శకుడు పైనే ఫైర్ అవుతున్నారు. మొత్తం మీద ప్రేమ గురించి ఒక గందరగోళమైన చర్చ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Also Read: Namo Bharat: నమో భారత్ రైలు వేగం, టికెట్ రేట్లు ఎంత..? ఏయే సౌకర్యాలు ఉంటాయి..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.