SS Rajamouli Birth Place: తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి ఎక్కడ పుట్టాడు ? అనే ప్రశ్న చాలా మందిని తొలిచేస్తూ ఉంటుంది. కానీ ఆయన ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పెరిగాడు? అనే విషయం మీద చాలా మందికి అవగాహన ఉండదు. నిజానికి రాజమౌళి పూర్వీకులది ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతం కావడంతో రాజమౌళి అక్కడే పుట్టి పెరిగాడు అని అందరూ అనుకుంటారు. తాజాగా ఇదే విషయాన్ని ఒక నెటిజన్ రాజమౌళిని ప్రశ్నించడంతో ఆయన ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఒక నెటిజన్ వికీపీడియాలో మీ పుట్టిన ప్రదేశం గురించి ఉన్న వార్త ఎంతవరకు నిజం అని ప్రశ్నించగా దానికి రాజమౌళి ఆసక్తికరంగా స్పందించారు. తాను అమరేశ్వర క్యాంప్, మాన్వి తాలూకా రాయచూరు జిల్లా కర్ణాటకలో జన్మించానని పేర్కొన్నారు. నిజానికి వికీపీడియాలో కూడా ఇదే సమాధానం ఉంది అంటే ఆయన కొవ్వూరులో జన్మించలేదు. కొవ్వూరు నుంచి వెళ్లి ఈ అమరేశ్వర క్యాంపులో స్థిరపడిన తెలుగు తల్లిదండ్రులకు ఆయన జన్మించారు.
ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తల్లి రాజనందిని. ఇక రాజమౌళి తండ్రి ఇంటి పేరు వి అయితే రాజమౌళికి మాత్రం ఎస్ ఎస్ అని ఉంటుంది. అది ఎందుకో ఎప్పుడైనా గమనించారా? అయితే ఇది చదవలసిందే. అసలు విషయం ఏమిటంటే రాజమౌళి తల్లిదండ్రులు శివ భక్తులు ఒకసారి శ్రీశైలంని దర్శించిన తర్వాత రాజమౌళి జన్మించడంతో ఆయనకు శ్రీశైల శ్రీ రాజమౌళి అనే పేరు పెట్టారు.
అందుకే రాజమౌళి తన ఇంటి పేరు కూడా వేసుకోకుండా ఎస్ఎస్ రాజమౌళి అని సినిమాల్లో వేసుకుంటూ ఉంటారు. రాజమౌళి చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబంలోనే పెరిగారు.. కొవ్వూరులో రాజమౌళి తాతలకు వందల ఎకరాలు ఉండేవి కానీ రైల్వే లైన్ కోసం భూముల సమీకరణ జరిపినప్పుడు వీరి కుటుంబానికి భారీగా నష్టం జరగడంతో ఇక ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని నష్టపరిహారం తీసుకుని రాయిచూర్ జిల్లాకు వెళ్లిపోయారు. రాజమౌళి జన్మించిన కొద్ది రోజులకే అంటే సుమారు నాలుగేళ్లకే మళ్లీ కొవ్వూరు వెనక్కి వచ్చారు. అదండీ రాజమౌళి పుట్టిన ప్రదేశం ఆయన పేరు వెనుక ఉన్న అసలు కథ.
Also Read: Vedhika Photos: హద్దులు దాటేస్తున్న వేదిక అందాల ఆరబోత.. సెగలు రేపేస్తోందిగా!
Also Read: Mrunal Thakur Photos: జక్కన్న చెక్కిన శిల్పానివా మృణాల్ ఠాకూర్..శిల్పాల మధ్య మెరుస్తోందిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి