Bellamkonda Dating: రష్మికతో ల‌వ్ ఎఫైర్‌.. ఎట్ట‌కేల‌కు ఓపెనయిన బెల్లంకొండ‌!

Sai Sreenivas Bellamkonda Rashmika Dating Rumors: గత కొద్ది రోజులుగా అడపా దడపా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రష్మిక మందన్న కలిసి కనిపిస్తూ ఉండడంతో వారి మధ్య ఏదో ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలో ఈ అంశం మీద బెల్లంకొండ స్పందించాడు.   

Written by - Chaganti Bhargav | Last Updated : May 3, 2023, 06:20 PM IST
Bellamkonda Dating: రష్మికతో ల‌వ్ ఎఫైర్‌.. ఎట్ట‌కేల‌కు ఓపెనయిన బెల్లంకొండ‌!

Sai Sreenivas Bellamkonda Rashmika Mandanna Dating: సినీ పరిశ్రమలో కొన్ని పుకార్లు ఎందుకు పుట్టుకొస్తాయో ఎలా పుట్టుకొస్తాయో కూడా తెలియదు. కానీ ఏమీ లేని వారి మధ్య కూడా ఏదో ఉందని ఫ్రేమ్ చేసే విధంగా కొన్ని పుకార్లు పుట్టుకొస్తూ ఉంటాయి. నిజానికి కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా లంచ్ అయ్యి తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన ఈ మధ్యనే బాలీవుడ్ బాట పట్టింది. మరోపక్క బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా రాక్షసుడు సినిమాతో టాలీవుడ్ లో హిట్ అందుకుని ఇప్పుడు బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చత్రపతి సినిమాని హిందీలో అదే పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ప్రభాస్ పాత్రలో సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. సాయి శ్రీనివాస్ నటించిన అనేక సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి యూట్యూబ్లో విడుదల చేస్తే మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్న నేపథ్యంలో ఈ చత్రపతి రీమేక్ సినిమాని పెన్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది.

అలా ఒకపక్క రష్మిక మందన్న మరోపక్క బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో పాగా వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి రష్మిక మందన చేసిన కొన్ని సినిమాలు హిందీలో రిలీజ్ కూడా అయ్యాయి. కానీ ఈ భామకు అనుకున్నంత క్రేజ్ అయితే దక్కలేదు. ఈ నేపథ్యంలో ఎక్కువగా ముంబైలోనే ఉంటూ అక్కడి దర్శక నిర్మాతల చుట్టూ అవకాశాల కోసం తిరగడమే కాదు బాలీవుడ్ లో ఎలాంటి సినిమా ఈవెంట్లు అయినా వెంటనే అక్కడ వాలిపోతుంది.

Also Read: Sree leela Lineup: మహేష్, పవన్, దేవరకొండ సహా ఏడుగురు హీరోల సినిమాలు లైన్లో పెట్టిన శ్రీలీల

ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సినిమా ఈవెంట్లో సాయి శ్రీనివాస్, రష్మిక మందన కలిసి కనిపించారు. వీరిద్దరూ గతంలో ఎలాంటి సినిమా చేయకపోయినా వీరిద్దరూ కలిసి మాట్లాడుకోవడం, ఫోటో ఫోజులు ఇవ్వడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం మొదలైంది. నిజానికి రష్మిక మందన ముందుగా రక్షిత్ శెట్టి అని హీరోతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. మరికొద్ది రోజుల్లో పెళ్లి ఉందనగా  తనకు టాలీవుడ్ లో మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు సదరు హీరోకి షాక్ ఇచ్చింది.

తర్వాత విజయ్ దేవరకొండ తో ప్రేమలో పడినట్లు కూడా ప్రచారం జరిగింది. విజయ్ దేవరకొండ రష్మిక కలిసి మాల్దీవులకు వెళ్ళినట్లు పలు వెకేషన్స్ కి వెళ్ళినట్లు సోషల్ మీడియాలోనే అనేక ప్రచారాలు జరిగా.యి అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ వారిద్దరి మధ్య బ్రేకప్ అయిందని అందుకే ఇప్పుడు రష్మిక మందన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మధ్య ఏదో జరుగుతోందని కొత్త ప్రచారం తెర మీదకు వచ్చింది. అయితే ఈ ప్రచారం మీద ఎట్టకేలకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్పందించాడు. హిందీ చత్రపతి సినిమా మే 12వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తోంది సినిమా యూనిట్.

అందుకే బాలీవుడ్ లో మీడియా హౌస్ లకు శ్రీనివాస్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపద్యంలో రష్మిక డేటింగ్ గురించి స్పందిస్తూ మేము ఇద్దరం కలుసుకోవడమే ఎప్పుడో జరుగుతూ ఉంటుంది. అలాంటిది మీరు ఏకంగా మేమిద్దరం డేటింగ్ చేస్తున్నామంటూ వార్తలు పుట్టించారు. మేము ప్రేమలో ఉన్నట్టుగా వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ ఆయన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వృత్తి రీత్యా హైదరాబాద్ ముంబై వెళ్లాల్సి వస్తుందని అప్పుడప్పుడు ఎయిర్ పోర్ట్ లో కలిసి కనిపించి ఉండవచ్చు ఏమో కానీ మేము ఎప్పుడూ ట్రావెల్ కలిసి చేయలేదని చెప్పుకొచ్చారు.

Also Read: Tamannaah Unbuttoned Pic: చొక్కా విప్పేసి తమన్నా హాట్ ట్రీట్.. క్లీవేజ్ షోతో రచ్చోభ్యహ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News