గంగవ్వ ( BB4 Telugu contestant Gangavva ).. బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షోలో కంటెస్టెంట్స్ అందరిలోనూ గంగవ్వ స్థానం చాలా ప్రత్యేకమైనది. పల్లెటూరి కూలీగా, అక్షర జ్ఞానం లేకున్నా.. పట్టుదలతో యూట్యూబర్‌గా మారిన గంగవ్వ క్రేజ్ అమాంతం పెరగడమే కాదు.. ఆమెను బిగ్ బాస్ హౌజ్ వరకు తీసుకొచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఇప్పటికే నాలుగు వారాలలో నలుగురు ఎలిమినేట్ ( Bigg boss 4 Telugu eliminations ) అయ్యారు. ఈ అయిదో వారం ఎవరు ఇంటి నుండి బయటికి వెళ్తారు అని అనుకుంటున్న సమయంలో గంగవ్వ నామినేషన్స్‌లో ( Gangavva wants to exit BB4 ) లేకపోయినా తనే ఈ వారం వెళ్ళేలా ఉంది. గంగవ్వకి ఆరోగ్యం సహకరించట్లేదని అందుకే ఇంక అక్కడ ఉండలేనని గంగవ్వ బిగ్ బాస్ హోస్ట్ నాగ్‌తో చెప్పింది. గత వారం రోజుల నుండి గంగవ్వ ఆరోగ్యం ( Gangavva health issues ) సరిగా లేదని బిగ్ బాస్ అనుమతి ఇస్తే గంగవ్వ వెళ్లిపోద్ది అని నాగ్ బిగ్ బాస్‌ని రెక్వెస్ట్ చేశాడు.
#Gangavva house nundi vellipothunda?? Do you Agree or Disagree??#BiggBossTelugu4 today at 9 PM on @StarMaa pic.twitter.com/JUB3gLAYsb
— starmaa (@StarMaa) October 10, 2020
గత వారం బిగ్ బాస్ ఫ్యాషన్ షోలో అబ్బాయిలంతా కలసి చక్కగా తయారైన లేడిస్‌లలో విన్నర్‌ని ప్రకటించమని బిగ్ బాస్ చెప్పగా.. గంగవ్వకి తన జీవితంలో మళ్లీ ఇటువంటి అవకాశం రాదు కదా అని వారు గంగవ్వను విన్నర్‌గా ప్రకటించి లక్ష రూపాయలు గిఫ్ట్ వోచర్‌ని అందించారు. ఆ ఎపిసోడ్ తర్వాత గంగవ్వ మీద బయట ఆడియెన్స్‌లో నెగెటివ్ కామెంట్స్ ( Memes against Gangavva ) కూడా వచ్చాయి. సానుభూతితో ఇంటి సభ్యులు గంగవ్వకు మద్దతిస్తున్నారని, ఏ టాస్క్‌లో పాల్గొనని గంగవ్వకే బిగ్ బాస్ టైటిల్ ( BB4 Telugu title winner ) కూడా అప్పజెప్పండి అని కామెంట్స్ వచ్చాయి.
ఎలాగోలా నెల రోజులకు పైగా బిగ్ బాస్ హౌజ్‌లో ఉంటూ అందరిని ఎంటర్టెయిన్ చేస్తూ, బిగ్ బాస్ హౌజ్‌లో ఓ పెద్ద దిక్కుగా ఉన్న గంగవ్వ, ఇంక అక్కడ ఉండడం తన వల్ల కావడం లేదని ఏడుస్తూ చెప్పింది. మరో రెండు వారాలు బిగ్ బాస్ హౌజ్‌లో కొనసాగాలని కోరికగా ఉన్నప్పటికీ.. ఆరోగ్యం సహకరించడంపోవడంతో ఉండలేకపోతున్నానని చెప్పి కన్నీళ్ల ( Gangavva broken down ) పర్యంతమయ్యింది. గంగవ్వ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ అనుమతి ఇస్తే ఆమెను ఇంటికి పంపిస్తామని నాగ్ కూడా బిగ్ బాస్‌కి విజ్ఞప్తి చేశాడు. ఈ విషయంపై బిగ్ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe