వ్యవస్థలు సరిగా నడపకున్నా, నాయకుల అనాలోచిన తప్పుడు నిర్ణయాలతో సామాన్య ప్రజలు ఇబ్బందుల పాలైతే.. ఎవ్వరకైన కోపం రావటం సహజమే.. కానీ కొంత వీటి పైన వచ్చే కోపాన్ని బహిర్గతం చేస్తారు మరి కొందరు కోపాన్ని చూపించకుండా ఉంటారు.
ఇపుడు ఇవన్ని ఎందుకు అనుకుంటున్నారా.. ?? అయితే ఒక విషయం ఉంది... ఆఫ్ఘానిస్థాన్ (Afghanisthan) ను తాలిబన్లు ఆక్రమించటం అక్కడ జరుగుతున్న అరాచకాల గురించి వింటూనే ఉన్నాం. దీనిపై కొంత మంది సానుభూతి తెలిపారు, మరి కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేసారు. కానీ సెలబ్రేటీలలో అందులోనూ.. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదరి సారిగా హీరో నిఖిల్ (Hero Nikhil) అమెరికా అధ్యక్షుడు (America President) జో బిడెన్ (Joe Biden) చేసిన పనికి కొంచెం ఘాటు గానే స్పందించాడు.
Also Read: Tollywood Drugs Case: మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు.. సెలబ్రిటీలను విచారించనున్న ఈడీ
ఆ దేశం నుండి అమెరికా బలగాలను (US Military )తిరిగి రప్పించటం, తాలిబన్ల (Taliban) ఆక్రమణ తరువాత అక్కడి ప్రజలు భయంతో ఇతర దేశాలకు పరుగులు తీయటం చూస్తూనే ఉన్నాం.. కొంత మంది పలు ఘటనల్లో ప్రాణాలను కోల్పోయిన సంగతి మనకు తెలిదిందే.. ఇది వరకే పెట్రోల్ రేట్లపై (Petrol Price) గట్టిగానే స్పందించిన హీరో నిఖిల్ ఈ సారి కూడా ఈ ఘటన పై ట్విట్టర్ లో....
Only Example of the FREE WORLD... America.... gone...
21 years u tourbled a country... and.... abandoned it in this way..
Next time u talk abt freedom
Mister BIDEN @JoeBiden cheppu teguddi .... yedava— Nikhil Siddhartha (@actor_Nikhil) August 25, 2021
"21 సంవత్సరాలు దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేసి.. ఇపుడు విడిచి వెళ్ళిపోయారు... మిస్టర్ బిడెన్- (Joe Biden) మరోసారి ఫ్రీడమ్ గురించి మాట్లాడితే చెప్పు తెగుద్ది... యెదవ" అని ట్విట్ చేసారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు వారికి నచ్చిన విధంగా కామెంట్స్ చేస్తుండగా.. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరలైంది.
Also Read: India vs England: భారత బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యం..తొలి ఇన్నింగ్స్‌లో 78కే ఆలౌట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook