Vivek Oberoi: వెబ్ సిరిస్ 'ఇన్‌సైడ్ ఎడ్జ్’' 3వ సీజన్(Inside Edge Season 3) అమెజాన్ ప్రైమ్(Amazon Prime) ఓటీటీ వేదికగా ఇటీవల రిలీజ్ అయ్యింది. వివేక్ ఒబెరాయ్, రీచాచద్దా, అంగద్ బేడీ, సిద్ధాంత్ చతుర్వేదీ కీలకపాత్రలు పోషించారు. ఇందులోని మొదటి రెండు సీజన్లు సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా మూడో సీజన్‌ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీని ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వివేక్‘(Vivek Oberoi)..బాలీవుడ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్(Bollywood)లో అడుగుపెట్టాలంటే..ప్రతిభ కంటే ఇంటిపేరే ముఖ్యమని వివేక్ వ్యాఖ్యానించారు. తాను 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నేటికీ ఇబ్బందులు తప్పట్లేదని వాపోయారు. హిందీ చిత్ర పరిశ్రమ యవ ప్రతిభను పెంచి పోషించే ఒక వ్యవస్థను అభివృద్ధి చేయలేకపోయిందన్నారు. బాలీవుడ్‌లో అవకాశాలకు, ప్రతిభకు సంబంధం ఉండదని...ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. వీలైనంత ఎక్కువ మంది యువతను ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని వివేక్ అన్నారు. ‘రక్త చరిత్ర(Rakta Charitra)’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు వివేక్ ఓబెరాయ్. ఆ తర్వాత రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘'వినయ విధేయ రామ’'లో విలన్‌గా మెప్పించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook