Nayanthara Angry With Jawan Director Atlee: జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నయనతార, ఆ చిత్ర దర్శకుడిపై అసంతృప్తిగా ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. షారూఖ్ ఖాన్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన జవాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బుధవారం వరకే జవాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 907 కోట్ల కలెక్షన్ వసూలు చేసి ఈ వీకెండ్ నాటికి 1000 కోట్ల క్లబ్ చేరే దిశగా దూసుకుపోతోంది. జవాన్ మూవీలో నయన తార ఫోర్స్ వన్ హెడ్ పాత్రలో నటించింది. అంతేకాదు.. ఈ సినిమాలో నయనతారపై పలు యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ నయనతార ఈ చిత్ర దర్శకుడు అట్లీపై కోపంగానే ఉందనేది కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్న టాక్ సారాంశం.
నయన తార మొదటిసారిగా నటించిన బాలీవుడ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందులోనూ షారుఖ్ ఖాన్ సరసన నటించిన సినిమా. అలాంటప్పుడు ఏ హీరోయిన్ అయినా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటి సినిమాను తనకు ఆఫర్ చేసినందుకు ఆ చిత్ర దర్శకుడికి థాంక్స్ చెబుతారు. కానీ నయనతార విషయంలో మాత్రం అలా జరగడం లేదని తెలుస్తోంది.
తాను కోరినంత పారితోషికం తీసుకుని, తాను నచ్చిన పాత్ర చేసి, సినిమా హిట్ అయిన తరువాత కూడా నయన తార ఎందుకు డీలా పడినట్టు అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. జవాన్ మూవీలో దీపికా పదుకొణె చేసిన ప్రత్యేక పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని.. దీపిక పదుకునేకు ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న పాత్ర ఇచ్చి తనకు మాత్రం తక్కువ ప్రాముఖ్యత ఉన్న పాత్ర ఇస్తావా అనేదే నయన తార మనసులో పడిందట. అందుకే అట్లీపై నయనతార కోపంగా ఉంది అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నయనతార సన్నిహిత వర్గాలు హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ, " జవాన్ సినిమాలో తన పాత్రను కట్ చేయడం ఆమెకు నచ్చని అంశం కాగా.. అదే సమయంలో దీపికా పదుకొనె పాత్ర బాగా వచ్చేలా ఎలివేట్ చేశాడని.. అందుకే అట్లీపై నయనతార గుర్రుగా ఉందని తెలుస్తోంది.
నయనతార ఇక బాలీవుడ్ సినిమాల్లో నటించదా ?
జవాన్ సినిమాలో తన పాత్రను కత్తిరించిన తీరుతో అప్సెట్ అయిన నయనతార ఇకపై బాలీవుడ్ లో సినిమాలు చేయడంపై ఆసక్తి చూపించడం లేదని ఆమె సన్నిహిత వర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది. జవాన్ సినిమాలో మెయిన్ హీరోయిన్ తానే అయినప్పటికీ... తన పాత్రను తగ్గించి ప్రత్యేక పాత్రలో వచ్చిన దీపికా పాత్రను పెంచడం నయనతారను బాగా నిరాశపరిచింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.