Kavya Kalyan Ram: రష్మిక బాటలో బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్‌ రామ్.. ఇకపై దుమ్ము దుమారమే..

Kavya Kalyan Ram: నేషనల్ క్రష్ రష్మిక బాటలో కావ్య కళ్యాణ్ రామ్ అడుగులు వేస్తోంది. రష్మిక తరహాలోనే బలగం భామ కావ్య కళ్యాణ్‌ రామ్  ఇపుడు ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లో నటించి రచ్చ లేపుతోంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : May 27, 2024, 01:30 PM IST
Kavya Kalyan Ram: రష్మిక బాటలో బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్‌ రామ్.. ఇకపై దుమ్ము దుమారమే..

Kavya Kalyan Ram: కావ్య కళ్యాణ్‌ రామ్.. బలగం సినిమాతో హీరోయిన్‌గా పాపులర్ అయింది. కథానాయికగా ఎంట్రీ ఇవ్వకముందే బాలనటిగా పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా గంగోత్రి సినిమాలో 'వల్లంకి పిట్ట, వల్లంకి పిట్ట సాంగ్‌తో అదరగొట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత పూణెలో 'లా' పూర్తి చేసింది. అయితే బలగం తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం కావ్యకు దక్కలేదు. తాజాగా ఈమె VYRL అనే యానివర్సల్ మ్యూజిక్ ఇండియా ఒరిజినల్ కంటెంట్‌తో తెలుగులో రెండు ప్రైవేట్ ఆల్బమ్స్ తో ప్రేక్షకుల ముందు వచ్చింది. ఫస్ట్ సింగిల్ 'ఓసెలియా'కి గణేష్ క్రోవ్విది, రిక్కి బి మరియు ఫిరోజ్ ఇజ్రాయోల్ మ్యూజిక్ అందించారు. ఈ ప్రైవేట్ ఆల్బమ్ పాటలో కావ్యా కళ్యాణ్‌ రామ్ నటించింది. ఈ మెలోడి ట్రాక్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు మ్యూజిక్ లవర్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది.

బాలీవుడ్‌లో ఈ తరహాల హృతిక్ రోషన్, సల్మాన్ వంటి హీరోలతో పాటు కరిష్మా, సోనమ్ కపూర్.. అటు రష్మిక మందన్న.. టాప్ టక్కర్ వంటి ఆల్బమ్‌తో అలరించిన సంగతి తెలిసిందే కదా. ఈ కోవలో కావ్య కళ్యాణ్‌ రామ్ ప్రైవేట్ ఆల్బమ్‌తో ప్రేక్షకులను అలరిస్తుందా అనేది చూడాలి.

కావ్య కళ్యాణ్‌ రామ్ ఆల్బమ్‌తో పాటు Vyrl సౌత్ తన రెండో సింగిల్ .. 'సిన్నదాని సూపులే' సాంగ్‌ ను రిలీజ్ చేసింది. టీవీ సెన్సెషన్ శ్రీ సత్య, వినోద్ కుమార్ నటించిన ఈ సాంగ్ మంచి విజువల్స్‌తో అట్రాక్టివ్‌గా ఉంది. ఈ పాటకు యాడిక్రీజ్ సంగీతం అందించారు. అంతేకాదు ఈ పాటలో మెరిసారు. మరోవైపు సాకేత్ కొమండూరి, దాసరి మేఘన నాయుడు కూడా ఈ పాటలో నటించారు. ఓ సెలియా, సిన్నదాని సుపులే ఈ రెండ సాంగ్స్ Vyrl సౌత్ యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉన్నాయి.

Also read: Remal Cyclone Alert: ఇవాళ తీరం దాటనున్న రెమల్ తుపాను, ఏపీలో రెండ్రోజులు వర్షసూచన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News