Vinayakan Arrest: జైలర్ మూవీ విలన్ అరెస్ట్.. కారణం ఇదే..!

Jailer Movie Actor Vinayakan Arrest News: మద్యం మత్తులో పోలీస్ స్టేషన్‌లో గొడవకు దిగినందుకు జైలర్ నటుడు వినాయకన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అరెస్ట్ చేసి.. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 25, 2023, 07:01 AM IST
Vinayakan Arrest: జైలర్ మూవీ విలన్ అరెస్ట్.. కారణం ఇదే..!

Jailer Movie Actor Vinayakan Arrest News: జైలర్ మూవీ విలన్ వినాయకన్‌ను కేరళ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఉన్న వినాయకన్.. ఎర్నాకుళం టౌన్‌ నార్త్‌ పోలీస్‌ స్టేషన్‌లో గొడవకు దిగడంతో అదుపులోకి తీసుకున్నారు. తమను ఇబ్బంది పెడుతున్నాడంటూ వినాయకన్ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు వినాయకన్‌ను పోలీసులు స్టేషన్‌కు రప్పించారు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న వినాయకన్.. సహనం కోల్పోయి పోలీసులతో గొడవకు దిగినట్లు సమాచారం. నటుడితో వారించేందుకు పోలీసులు ప్రయత్నించినా.. మాట వినకపోవడంతో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. 

కాగా.. వినాయకన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఓ మోడల్‌ను వేధించిన కారణంగా అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలర్‌ మూవీ రిలీజ్ అయిన సమయంలో ఈ న్యూస్ చక్కర్లు కొట్టాయి. తాజాగా మరోసారి అపార్ట్‌మెంట్‌ వాసులను ఇబ్బందులకు గురి చేసి అరెస్ట్ అయ్యాడు.

వినాయకన్ మలయాళీ నటుడు కాగా.. తెలుగు ప్రేక్షకలకు కళ్యాణ్ రామ్ 'అసాధ్యుడు' మూవీతో పరిచయం అయ్యాడు. మళ్లీ మరో తెలుగు సినిమాలో ఆయన నటించలేదు. అయితే డబ్బింగ్ సినిమాల్లోనూ పాత్రలతో ఆకట్టుకున్నాడు. ఇటీవల జైలర్ మూవీలో వర్త్ వర్మ వర్త్ అంటూ అలరించాడు. అంతేకాకుండా మూవీలో డ్యాన్స్‌తోనూ అలరించాడు. మీమర్స్‌కు వినాయకన్‌ డ్యాన్స్‌ వీడియో తెగ ఉపయోగపడుతోంది. ఆయనలో నటుడే కాకుండా.. డ్యాన్సర్, సింగర్, సంగీత దర్శకుడు కూడా ఉన్నాడు. త్వరలో విక్రమ్ మూవీ ధ్రువ నక్షత్రంలో విలన్‌గా అలరించనున్నాడు. ఈ మూవీ నవంబర్ 24న ఆడియన్స్ ముందుకు రానుంది.

Also Read: Namo Bharat: నమో భారత్ రైలు వేగం, టికెట్ రేట్లు ఎంత..? ఏయే సౌకర్యాలు ఉంటాయి..?

Also Read: TDP-Janasena: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ-జనసేన పోరాటం.. ఉమ్మడి తీర్మానాలు ఇవే..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News