Akhil: మాజీ వదిన సమంతకు మద్దతుగా అఖిల్‌.. మంత్రి కొండా సురేఖకు సమాజంలో చోటు లేదు

Akkineni Akhil Strong Warning To Konda Surekha: తన కుటుంబంపై చేసిన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై యువ నటుడు అక్కినేని అఖిల్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఆమెకు సమాజంలో చోటే లేదని మండిపడ్డారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 4, 2024, 11:35 AM IST
Akhil: మాజీ వదిన సమంతకు మద్దతుగా అఖిల్‌.. మంత్రి కొండా సురేఖకు సమాజంలో చోటు లేదు

Akkineni Akhil Konda Surekha: అసభ్యకరంగా.. సభ్య సమాజం తల దించుకునే తీరులో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల దుమారం రగడ సినీ పరిశ్రమలో కొనసాగుతూనే ఉంది. సినీ పరిశ్రమలో కల్లోలం రేపుతున్న ఈ వివాదంపై తాజాగా సమంత మాజీ మరిది, సినీ నటుడు అక్కినేని అఖిల్‌ కూడా స్పందించారు. తన మాజీ వదినకు మద్దతుగా నోరు విప్పాడు. ఈ సందర్భంగా కొండా సురేఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీ ప్రవర్తన సిగ్గుచేటు అంటూ తీవ్రస్థాయిలో విమర్శించాడు. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించాడు.

Also Read: Nagarjuna: ఎక్కడా తగ్గని నాగార్జున.. మంత్రి కొండా సురేఖను కోర్టుకు ఈడ్చిన హీరో

తన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసిన కొండా సురేఖపై 'ఎక్స్‌' వేదికగా అక్కినేని అఖిల్‌ స్పందించాడు. 'కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారం, హాస్యాస్పదం, అసభ్యకరం, జుగుప్సాకరం.. ఆమె సామాజిక విలువలు, సంక్షేమాన్ని మర్చిపోయారు. ప్రజా ప్రజాప్రతినిధిగా ఆమె ప్రవర్తన సిగ్గుచేటు, క్షమించరానిది. ఆమె వ్యాఖ్యలు మా కుటుంబసభ్యుల గౌరవాన్ని కించపరిచాయి. అగౌరవపరిచాయి' అని అఖిల్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Also Read: Big Shock Jr NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌కు భారీ షాక్‌ ఇచ్చిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఏం జరిగిందో తెలుసా?

'ఆమె స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం మాకు సంబంధం లేని మా కుటుంబాన్ని లాగడం అభ్యంతరకరం. ఆమె ఆడిన రాజకీయ క్రీడలో మాలాంటి అమాయకులను బలి పశువులుగా నిలబెట్టారు. బాధిత కుటుంబ సభ్యుడిగా, సినీ నటుడిగా ఈ విషయంపై నేను మౌనంగా ఉండను. ఈ సిగ్గుమాలిన వ్యక్తికి న్యాయపరంగా తగిన బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ సమాజంలో ఆమె లాంటి వాళ్లకు స్థానం లేదు' అఖిల్ తెలిపాడు.

అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై సినీ పరిశ్రమ వదలడం లేదు. సినీ అగ్ర నటులు మహేశ్‌ బాబు, రామ్‌ చరణ్‌ తేజ, ప్రభాస్‌ స్పందించారు. సినీ పరిశ్రమ ఇలాంటి వ్యాఖ్యలను సహించదని స్పష్టం చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలు నిరాధార ఆరోపణలు.. అవాస్తవమని పేర్కొన్నారు. వ్యక్తిగత వ్యాఖ్యలను కించపరచడం సహించరానిదని సినీ ప్రముఖులు తెలిపారు. సురేఖ వ్యవహారం చాలా తప్పని ఖండించారు. హాస్య నటుడు బ్రహ్మాజీ కూడా స్పందిస్తూ.. 'నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కారణం మీకు చెప్పాల'? అని ప్రశ్నించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

Trending News