Mahesh Babu- Rajamouli Film Craze: ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రాజమౌళి ఎలా అయినా ఆర్ఆర్ఆర్ సినిమాకి ఒక్క ఆస్కార్ అవార్డు అయినా తీసుకురావాలని ప్రయత్నంలో ఉన్నారు. సినిమా రిలీజ్ చేసినప్పుడు ఈ ఆస్కార్ వస్తుందో? లేదో? అని అంచనాలు ఎవరికీ లేవుగాని ప్రస్తుతానికి ఆర్ఆర్ఆర్ టీం అమెరికాలోనే తిష్ట వేసి దాన్ని ప్రమోట్ చేస్తున్న నేపథ్యాన్ని కనుక మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ఒక ఆస్కార్ అవార్డు తీసుకురావాలని లక్ష్యంతో వారంతా కష్టపడుతున్నట్లుగా అర్థమవుతుంది.
ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్నా సరే ఆస్కార్ అవార్డు కోసమే టీం ఇంకా అక్కడ వెయిట్ చేస్తోంది. రాంచరణ్ ఎన్టీఆర్ వంటి వారు వెనక్కి వచ్చేసినా రాజమౌళి అండ్ కో మాత్రం అక్కడే ఉండి తమ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అందరం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళిని ఇక్కడ సినిమా చేస్తే చెప్పాలని కలిసి మాట్లాడదామని ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
అయితే నిజంగా రాజమౌళి హాలీవుడ్ లో సినిమా చేస్తాడో లేదో అనే సంగతి పక్కన పెడితే రాజమౌళి నుంచి వస్తున్న తరువాతి ప్రాజెక్టు మీద ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అంచనాలు ఉంటాయనేది ఎవరు కాదనలేని వాస్తవం. దానికి తగ్గట్టుగానే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబుతో చేస్తున్నాం, ఆ సినిమాకు హాలీవుడ్ రేంజ్ కథ ఇస్తున్నాం అంటూ ముందు నుంచి ఊదరగొడుతూనే వస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. రాజమౌళి చేసే కథ మహేష్ కెరీర్ లోనే భారీ హిట్ అవుతుందని ఆయన కెరీర్ కి రాజమౌళి సినిమా మరింత బూస్ట్ అవుతుందని వారంతా భావిస్తున్నారు. ఖచ్చితంగా రాజమౌళి మహేష్ బాబు సినిమా ఇప్పటివరకు రాజమౌళి కెరియర్లో చేసిన సినిమాలన్నింటిలోకి కూడా టాప్ గా నిలుస్తుందని, అంతర్జాతీయ స్థాయిలో సినిమా నిలుస్తుందని వారందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Rashmika Mandanna Emotional: మగాడిలా ఉన్నావంటూ ట్రోల్స్.. రష్మిక ఏమందో తెలుసా?
Also Read: Love Today Scene: తమిళనాడులో ఫోన్లు మార్చుకున్న లవ్ కపుల్.. 'ఆ' వీడియోలు బయటపడడంతో మొదటికే మోసం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook