Nandamuri Balakrishna Fires on YCP MLA Gopireddy Sreenivas Reddy: ఏపీలో అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేకి టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల నరసరావుపేటలో జరిగిన వేడుకల్లో తన సినిమా పాటలు తొలగించాలని ఒక ఎమ్మెల్యే చెప్పడం సరి కాదని రాజకీయాలకు సినిమాలకు ముడి పెట్ట వద్దు అని ఆయన అన్నారు. రాజకీయాలను రాజకీయాల్లాగానే చూడాలి, సినిమాలను సినిమాల్లాగానే చూడాలి. మరోసారి ఇటువంటి ఘటనలు జరిగితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.
తెనాలిలో పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పాల్గొన్న ఆయన జాగ్రత్త హెచ్చరిస్తున్న చిటిక వేస్తే చాలు నేను మూడో కన్ను తెరిస్తే, అంటూ బాలయ్య తనదైన శైలిలో వార్నింగ్ ఇవ్వడంతో అక్కడ ఉన్న వారంతా కరతాళ ధ్వనులతో స్వాగతించారు. అసలు విషయం ఏమిటంటే ఇటీవల నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకరిపై తీవ్రస్థాయిలో నందమూరి బాలకృష్ణ పాట పెట్టినందుకు ఫైరవడంతో ఆ వ్యక్తి సూసైడ్ అటెంట్ కూడా చేశారు. అసలు విషయం ఏమిటంటే నరసరావుపేటలోని రామిరెడ్డి పేటలో శివరాత్రికి కోటప్పకొండ తిరుణాల కోసం ఒక ప్రభ రూపొందించారు. ఈ ప్రభ నిర్మాణానికి పార్టీలకు అతీతంగా భక్తులు విరాళాలు ఇచ్చారు.
అయితే ఈ ప్రభ వద్ద డాన్స్ ప్రోగ్రాం నిర్వహించినప్పుడు సినీ హీరో బాలకృష్ణ పాటలు పెట్టి డాన్స్ చేశారు. ఈ విషయం మీద వైసీపీ శ్రేణులు గోపిరెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఆ ప్రభ ఏర్పాటు చేసిన భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని మందలించడమే కాదు హెచ్చరించారని తెలుస్తోంది. దీంతో మనస్థాపానికి గురైన భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే ఇంటి ముందుకు వెళ్లి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.
దీంతో వెంటనే అక్కడే ఉన్న పోలీసులు కార్యకర్తలు అడ్డుకున్నారు తర్వాత అతన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ ఈ మేరకి కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది., నాతో పెట్టుకోకు నేను మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో తెలుసుకో అంటూ ఆయన ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ఇక నా సినిమాల జోలికి వస్తే వ్యవహారం వేరేగా ఉంటుందని బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మరి ఈ విషయం మీద గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎలా స్పందిస్తారని తెలియాల్సి ఉంది
Also Read: Vitamin B12 Deficiency: మీలో విటమిన్ బీ12 లోపం ఉంటే ఇబ్బందులు తప్పవు.. చెక్ చేసుకోండిలా!
Also Read: Optical Illusion: ఈ ఫోటోలో మూడు గుడ్లగూబలు ఉన్నాయి.. 10 సెకన్లలో కనుక్కుంటే తోపులే..ట్రై చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook