Netflix CEO Meets Mahesh Babu:
ప్రస్తుతం ఉన్న ఓటీపీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎంతగానో పేరు తెచ్చుకున్న ప్రత్యేక ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్. కాగా నెట్ ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్ ఈ మధ్యనే ఇండియాకి వచ్చి ఇక్కడ మన తెలుగు హీరోలతో సందడి చేయడం అందరిని ఆకట్టుకుంటూ ఉంది. మొదటిగా మన తెలుగు హీరోల్లో మెగా ఫ్యామిలీని కలిశారు. చిరంజీవి ఇంట్లో లంచ్ చేసి ఆక్కడ చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, నిర్మాతలు శోభు యార్లగడ్డ, విక్కీలతో ఆయన ఫోటోలు దిగాడు. కాగా ఆ ఫోటోలు తెగ వైరల్ గా మారాయి.
ఇక మెగా ఫ్యామిలీని కలిసిన వెంటనే నిన్న నందమూరి ఫ్యామిలీని కూడా కలిసి నందమూరి అభిమానులను కూడా తెగ ఖుషి చేశారు. ఎన్టీఆర్ ఇంట్లో లంచ్ చేసి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, కొరటాల శివతో ముచ్చటించారు టెడ్. ఇక మెగా.. నందమూరి ఫ్యామిలీ అవ్వగానే ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ వద్దకు వెళ్లారు. గుంటూరు కారం సినిమా సెట్స్ లో టెడ్ సరండోస్ సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిశాడు.
మహేష్ బాబు, త్రివిక్రమ్ తో గుంటూరు కారం షూటింగ్ సమయంలో టెడ్ సరండోస్ దిగిన ఫోటోనో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతున్నాయి.. కాగా మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ ఫోటోలను షేర్ చేస్తూ..నెట్ ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్ తో పాటు అతని టీం మోనికా షెర్గిల్, అభిషేక్ గోరాడియాలతో ఫ్యూచర్ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు కాఫీ తాగుతూ మాట్లాడుకున్నాం అని పోస్ట్ పెట్టారు.
Coffee and chill!!
Some interesting conversations about the future of entertainment with the visionary #TedSarandos and his fabulous team #MonikaShergill #AbhishekGoradia@NetflixIndia pic.twitter.com/lpoXqMWz05— Mahesh Babu (@urstrulyMahesh) December 9, 2023
ఇక ఇలా ఏకంగా నెట్ ఫ్లిక్స్ సీఈవో సడెన్ గా ఇండియాకి వచ్చి టాలీవుడ్ హీరోలతో ముచ్చటించడంతో.. నెట్ ఫ్లిక్స్ టాలీవుడ్ లో గట్టిగా ఏదైనా ప్లాన్ చేస్తుందా? లేదా కేవలం ఇక్కడికి వచ్చారు కాబట్టి మర్యాదపూర్వకంగా కలిసి వెళ్ళారా? అనే సందేహాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: New Ministers History: తెలంగాణా కొత్త మంత్రుల పూర్తి హిస్టరీ..రాజకీయ అరంగేట్రం వివరాలు..
Also Read: CM Revanth Reddy: కొత్త ప్రభుత్వంలో ప్రక్షాళన.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి